Andaman Oil Discovery : అండమాన్ సముద్రం.. భారత్ కు అత్యంత ఆశాజనక భవిష్యత్ ను ఇవ్వబోతోందా? అంటే ఔననే అనిపిస్తోంది. ఇది అత్యంత కీలకమైన ప్రాంతం. మిలటరీ, సైనిక పరంగా అత్యంత కీలక స్థావరం ఇదీ.
మొట్టమొదటి థియేటర్ కమాండ్ ఏర్పడింది కూడా అండమాన్ లోనే.. ఇప్పటికే మోడీ ప్రభుత్వం.. గ్రేటర్ నికోబర్ లో ట్రాన్స్ షిప్మన్ పోర్ట్ కట్టబోతోంది. అత్యంత కీలకమైన ప్రాంతంలో అద్భుతం బయటపడింది.
మన కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి ఒక సంచలన ప్రకటన చేశారు. భారత్ నాలుగు ట్రిలయన్ల ఎకానమీ నుంచి 20 ట్రిలియన్లకు ఎదగబోతోందని తెలిపారు. అండమాన్ నికోబర్ లో 43 బిలియన్ మెట్రిక్ టన్నుల ఆయిల్ నిక్షేపాలు దొరకబోతున్నాయని సంచలన ప్రకటన చేశారు. ప్రపంచంలోని అత్యంత ఆయిల్ నిక్షేపాలు ఉన్న దేశాల్లో ఇండియా పెద్ద దేశం కాబోతోంది. ప్రాథమిక ఆధారాలు లేకుండా ఒక కేంద్రమంత్రి మాట్లాడారు. ఓఎన్జీజీసీ పరిశోధనలో చమురు నిక్షేపాలు బయటపడ్డాయి కాబట్టే ఈ ప్రకటన చేశారు.
ఇదే జరిగితే భారత్ దిశ, దశ మారబోతోంది. ప్రతీ దేశంలోనూ ఆయిల్ కొనుక్కోవాలి. యుద్ధాలు జరిగితే ఆయిల్ కొనుక్కోవడానికి తీవ్ర ఇబ్బందులను భారత్ ఎదుర్కొంటోంది. ఇది భారత్ కు గొప్పవరం లాంటిది..
ఇన్నిరోజులు దొరకనదిది ఇప్పుడు ఎలా దొరికాయంటే.. పాలసీ విధానమైన మార్పులు చేశారు. అసలేం జరిగింది? ఎలా దొరికాయి.. అండమాన్ సముద్రంలో భారీ ఆయిల్ గ్యాస్ నిల్వలుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.