Jammu Kashmir by-elections: కాంగ్రెస్ కు కోపమొచ్చింది. బీహార్ లో విపరీతమైన అసహనం పెరిగింది. ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ ఢిల్లీకి బీహార్ లో పొత్తుల గురించి మాట్లాడడానికి వస్తే కనీసం కలవడానికే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇష్టపడలేదు.
మహారాష్ట్రలో ఇప్పుడు చూస్తుంటే.. ఉద్దవ్ ఠాక్రే తన సోదరుడు రాజ్ థాక్రేతో కలిసి ముందుకెళుతున్నాడు. కాంగ్రెస్ తో ఉద్దవ్ కటీఫ్ చేసుకున్నాడు.
ఇప్పుడు కశ్మీర్ లో కూడా నేషనల్ కాన్ఫరెన్స్ కు , కాంగ్రెస్ కు పడడం లేదు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ కు 42 సీట్లు వస్తే.. కాంగ్రెస్ కు కేవలం 6 వచ్చాయి. స్ట్రైక్ రేటు బీహార్ లోలాగానే కాంగ్రెస్ కు బాగా తక్కువ ఉంది. నేషనల్ కాన్ఫరెన్స్ కు జమ్మూ అసెంబ్లీలో కాంగ్రెస్ అవసరం పడలేదు. సీపీఎం, చిన్న పార్టీల మద్దతుతో కశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం నిలబడింది.
ఇప్పుడు జమ్మూకాశ్మీర్ లో మొట్టమొదటిసారి 4 రాజ్యసభ, 2 అసెంబ్లీ ఉప ఎన్నికలు వస్తున్నాయి. అక్టోబర్ 24 పోటీచేయబోతున్నాయి.
జమ్మూ కాశ్మీర్ లో 4 రాజ్యసభ 2 అసెంబ్లీ ఉప ఎన్నికలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.