Samantha: సమంత(Samantha Ruth Prabhu) జీవితం ఒక తెరిచినా పుస్తకం లాంటిది. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అన్ని విషయాలు పబ్లిక్ లోనే ఉన్నాయి. ముఖ్యంగా నాగ చైతన్య తో ప్రేమ,పెళ్లి, విడాకుల వ్యవహారాల గురించి ఇప్పటికీ సోషల్ మీడియా లో ఎదో ఒక కథనం వస్తూనే ఉంటుంది. నాగ చైతన్య రెండవ పెళ్లి చేసుకొని, తన వ్యక్తిగత జీవితాన్ని,తన కెరీర్ ని అద్భుతంగా మైంటైన్ చేస్తున్నాడు. మరోపక్క సమంత కూడా త్వరలోనే రెండవ పెళ్లి చేసుకోవడానికి రెడీ గా ఉంది. గత కొంతకాలంగా ఆమె బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు తో ప్రేమాయణం నడుపుతుంది. ఇద్దరు కలిసి ఇప్పుడు ఒకే ఇంట్లో ఉంటున్నారు కూడా. ఆమె కెరీర్ ని కూడా తనకు నచ్చిన రీతిలో కొనసాగిస్తూ ముందుకెళ్తుంది. ఇలా ఎవరి జీవితాలను వాళ్ళు చూసుకుంటున్నారు. అయితే సోషల్ మీడియా లో వచ్చే కొన్ని కామెంట్స్ పై సమంత రీసెంట్ గానే ఒక జాతీయ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడుతూ ‘నేను కెరీర్ పరంగా ఒడిదుగులను ఎదురుకుంటున్నప్పుడు నన్ను చూసి చాలామంది నవ్వుకున్నారు. నాకు సోకినా మాయోసైటిస్ వ్యాధిని చూసి ఎగతాళి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక నా మాజీ భర్త తో విడాకులు తీసుకున్నప్పుడు నన్ను ద్వేషించే ఎంతోమంది సంబరాలు చేసుకున్నారు. నా జీవితం ఎలా ఉండబోతుంది అనేది కూడా వాళ్ళే సోషల్ మీడియాలో నిర్ణయించేవారు. అవన్నీ చూసినప్పుడు మొదట్లో చాలా బాధ వేసేది. కానీ చిన్నగా పట్టించుకోవడం మానేసాను’ అంటూ చెప్పుకొచ్చింది సమంత. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఒక స్త్రీ విడాకులు తీసుకున్నప్పుడు ఎంతో వేదనని అనుభవిస్తుంది, సమాజం నుండి ఎదురయ్యే అవమానాలను కూడా ఎదురుకోవాల్సి వస్తుంది. అతి క్లిష్టమైన సమయమైనటువంటి ఆ సందర్భంలో ధైర్యాన్ని ఇచ్చే మాటలు మాట్లాడడమే మానవత్వం. అది సమంత విషయం లో లోపించింది అంటూ ఆమె అభిమానులు ఇప్పటికీ అంటూ ఉంటారు.
ఇక సమంత కెరీర్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె సినిమాల విషయం లో ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఒకప్పటి లాగా రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ కి ఆమె ఒప్పుకోవడం లేదు. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే చేస్తోంది. అంతే కాదు తన అభిరుచికి తగ్గట్టుగా ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే సంస్థ ని ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారా ఆమె నిర్మించిన మొట్టమొదటి చిత్రం ‘శుభమ్’ ఈ ఏడాది విడుదలై సూపర్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకుంది. ఇదే సంస్థలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తూ ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రాన్ని కూడా ప్రకటించింది. ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.