Ram Charan: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ మరదలు అనుష్పల వివాహం బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. ఉపాసన కామినేని ముద్దుల చెల్లెలు అనుష్పల తను ప్రేమించిన అబ్బాయితోనే ఈ వివాహం నిశ్చయించారు పెద్దలు. సన్నిహితులు, కుటుంబ పెద్దల సమక్షంలో నిన్న అర్మాన్ ఇబ్రహిమ్తో పెళ్లి ఘనంగా జరిగింది. అనుశ్పాల, అర్మాన్‌ల వివాహానికి ముందు జరిగిన వేడుకలకు సంబంధించిన ఫొటోలు ఇటీవలే సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే రామ్‌చరణ్, ఉపాసన ఫ్యామిలీ రాయల్‌లుక్‌లో అదిరిపోయే డ్రస్‌తో దర్శనమిచ్చారు.
పెళ్లిలో రామ్‌చరణ్ క్రీమ్ కలర్ షేర్వాణి ధరించగా.. ఉపాసన భారీగా అలంకరించిన షరారా సెట్‌ను ధరించింది. తన సోదరి వివాహానికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ.. నిజంగా నా జీవితంలో ఇది ప్రత్యేకమైన రోజు. నా ముద్దుల చెల్లెలు మీరాకు శుభాకాంక్షలు.. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా.. అంటూ పోస్ట్ చేసింది. దీంతో పాటు, ఈవెంట్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసింది.
Also Read: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ లో ఇవే హైలైట్స్.. ఇవి 5 గమనించారా?
కాగా, అపోలో గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ శోభనా కామినేని, అనిల్ కామినేని దంపతుల కుమార్తె అనుష్పాల కామినేని.రేసర్ అర్మన్, అనుష్పాల గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. మాజీ ఇండియన్ ఎఫ్3 ఛాంపియన్ అక్బర్ ఇబ్రహిమ్ తనయుడే అర్మన్ ఇబ్రహిమ్. ఈ క్రమంలోనే తండ్రికి తగ్గ తనయుడిగా కార్ రేస్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
మరోవైపు ఆచార్య సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న మెగాస్టార్.. ఈ సినిమా తర్వాత వరుసగా మరో రెండు, మూడు ప్రాజెక్టులను సిద్ధం చేసుకున్నారు. రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ షూటింగ్ ముగించుకుని.. శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాను పట్టాలెకక్కించాడు. ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్ పర్తి చేసుకుని.. రెండో షెడ్యూల్లోకి అడుగుపెట్టింది.
Also Read: ఫస్ట్ఆఫ్ మొత్తం తారక్.. సెకండ్ ఆఫ్‌లో రామ్ బీభత్సం.. ట్రైలర్లో రాజమౌళి చెప్పింది ఇదేనా?
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Ram charan and upasana royal look at anushpala kaminenis wedding
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com