Klin Kaara Birthday
Klin Kaara Birthday: మెగా వారసురాలు క్లిన్ కార కొణిదెల మొదటి జన్మదినం నేడు. 2023 జూన్ 20న ఉపాసన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 11 ఏళ్లుగా మెగా ఫ్యామిలీ, అభిమానులు ఎదురు చూస్తున్న క్షణం అది. ఉపాసన-రామ్ చరణ్ 2012లో వివాహం చేసుకున్నారు. రామ్ చరణ్ కంటే ఓ ఏడాది ముందు వివాహాలు చేసుకున్న అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇద్దరు పిల్లల చొప్పున కన్నారు. ఎంతకీ గుడ్ న్యూస్ చెప్పని నేపథ్యంలో రామ్ చరణ్ దంపతుల మీద అనేక పుకార్లు అపవాదులు చక్కర్లు కొట్టాయి.
సన్నిహితులు, బంధువుల నుండి కూడా ఒత్తిడి ఎదురైందని ఉపాసన ఒకటి రెండు సందర్భాల్లో వెల్లడించారు. అయితే పెళ్ళైన పదేళ్ల తర్వాతే పిల్లల్ని కనాలని రామ్ చరణ్ తో ఉపాసన ముందుగానే ఒప్పందం చేసుకుందట. దాని ప్రకారమే ఫ్యామిలీ ప్లానింగ్ ఆలస్యంగా చేశారట. మొత్తంగా మెగా ఫ్యామిలీలోకి కొత్త సభ్యురాలు వచ్చింది. కాగా ఉపాసన గర్భవతిగా ఉన్నప్పుడు, ప్రసవం రోజు ఎలాంటి పరిస్థితి నెలకొంది, కుటుంబ సభ్యుల ఎక్సయిట్మెంట్ ఎలా ఉందో వీడియో రూపంలో ఉపాసన పంచుకుంది.
క్లిన్ కార బర్త్ డే నేపథ్యంలో ఈ వీడియో తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేసింది. పెళ్ళై 11 సంవత్సరాలు గడిచిపోవడంతో మీరిద్దరూ ఏం చేస్తున్నారని సన్నిహితులు,బంధులు అడిగారని రామ్ చరణ్ సదరు వీడియో అన్నాడు. అలాగే ఉపాసన బెటర్ పార్ట్నర్ అని కొనియాడారు. ఉపాసన గర్భం దాల్చాక… బిడ్డను ఎప్పుడు చేతుల్లోకి తీసుకుంటామా అని ఆతృత కలిగిందని చిరంజీవి అన్నారు.
ఇక డెలివరీకి ఉపాసన లోపలికి వెళుతుండగా కుటుంబ సభ్యులు అందరూ రూమ్ బయట వేచి చూశారు. ఆమెను సాదరంగా లోపలికి పంపారు. మొదటిసారిగా పాపను రామ్ చరణ్ చేతుల్లోకి తీసుకున్నారు. చిరంజీవి తన వియ్యంకుడిని ఆలింగనం చేసుకున్నారు. స్వీట్స్ పంచుకున్నారు. సిబ్బందికి కూడా స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ హ్యాపీ మూమెంట్స్ కి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇక క్లిన్ కార రాక అనంతరం మెగా ఫ్యామిలీలో అనేక శుభాలు చోటు చేసుకున్నాయి.
Web Title: Klin kaara first birthday upasana burst into tears with a video of what happened on the day of delivery