Health Tips : మన వంట గదిలో ఉన్న కొన్ని పదార్థాలతో అనారోగ్య సమస్యలను క్లియర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా వంటగదిలో ఉండే దినుసులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అందరి వంటింట్లో సాధారణంగా ధనియాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. వీటిని ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తారు. మసాలాలు తయారు చేయడానికి, చికెన్, మటన్ వంటి మసాలా కూరల్లోకి వండుతారు. ఈ ధనియాలతోనే కొత్తమీర విత్తనాలు కూడా వేస్తారు. వీటివల్లే కొత్తమీర అవుతుంది. అయితే వీటిని కేవలం వంటల్లోనే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలకు కూడా ఉపయోగించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయని, వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొందరు ఎక్కువ బరువుతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈజీగా బురువు తగ్గవచ్చు. ఈ ధనియాలతో నీరు తయారు చేసుకుని తాగితే కేవలం ఒక నెల రోజుల్లోనే ఈజీగా బరువు తగ్గుతారు. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ధనియాల్లో విటమిన్ సి, విటమిన్ బి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, కాపర్, జింక్, సెలీనియం, మాంగనీస్, సోడియం కార్బోహైడ్రేట్ వంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కల్పిస్తాయి.
ఇందులోని ఔషధ గుణాల వల్ల జీర్ణ సమస్యలను క్లియర్ చేస్తుంది. అలాగే అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. వీటివల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు అలర్జీ సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. కొందరు యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ధనియాల గింజల వాటర్‌లో చక్కెర కలిపి తాగాలి. ఇలా చేస్తే యూరిన్ సమస్య క్లియర్ అవుతుంది. ధనియాల నీరు శీతలీకరణ ప్రభావాన్ని అందించడంతో పాటు మూత్రనాళంలో మంటను తొలగిస్తుంది. ధనియాల గింజలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ సమస్యను క్లియర్ చేస్తాయి. అలాగే వాపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కొందరు ఊబకాయం సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ధనియాల గింజల నీటిని డైలీ తాగడం వల్ల బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ అంతా కూడా క్లియర్ అవుతుంది. కేవలం ధనియాల గింజల నీరు మాత్రమే కాకుండా ధనియాల టీని కూడా తాగడం వల్ల బరువు తగ్గుతారు. డైలీ సాధారణ టీ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. దాని బదులు ధనియాల టీని తాగితే అనారోగ్య సమస్యల నుంచి విముక్తి చెందడంతో పాటు బరువు ఈజీగా తగ్గుతారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.