Yuge Yuge Bharat National Museum : మ్యూజియం అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఫ్రాన్స్ దేశంలోని పారిస్ లో గల లావ్రే మ్యూజియం. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంగా ఖ్యాతిగడిచింది. 73వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇప్పుడు దాన్ని అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం లక్షా 17వేల చదరపు మీటర్ల విస్తీర్ణంతో భారతదేశం నిర్మించబోతోంది. నిజంగా నిజం ఇదీ
ఇప్పటివరకూ పాలన కేంద్రంగా నార్త్ సౌత్ బ్లాక్ కార్యాలయాల్లో ఈ అతిపెద్ద మ్యూజియంను ఏర్పాటు చేయబోతున్నారు. బ్రిటీష్ కాలం నుంచి ఇప్పటిదాకా మూడు అంతస్తుల్లో 900కు పైగా గదులు ఉన్నాయి. సెంట్రల్ విస్తా పూర్తయ్యాక ప్రారంభమయ్యాక.. నార్త్ సౌత్ బ్లాక్ లను తరలించి వీటిల్లో అతిపెద్ద మ్యూజియం ఏర్పాటు చేయబోతున్నారు.
ఇందులో 5వేల సంవత్సరాల నాటి సంస్కృతి నాగరికతను ఇందులో నిక్షిప్తం చేయబోతున్నారు. భారత్ లోని విలువైన వస్తువులు, చారిత్రిక గాథలను ఇందులో పొందుపరుచనున్నారు. సింధూ నాగరితక , బుద్దుడు, జైనుడు, మౌర్యులు, చౌళుల, స్వాతంత్రోద్యమ పోరాటం.. ఇప్పటిదాకా అందరి చరిత్రను ఇందులో నిక్షిప్తం చేయనున్నారు.
త్వరలో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం మన దేశంలో ఏర్పాటు కాబోతున్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
