
MLC Election 2023 : ఎమ్మెల్సీ అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. సామాజిక సాధికారతకు పెద్దపీట వేసినట్టు చెప్పింది. ఎన్నికల హామీను నిలబెట్టుకున్నట్టు వెల్లడించింది. ప్రతిపక్షం మాటలతో చెబితే.. తాము చేతల్లో చూపామని తేల్చింది. బలహీన వర్గాలకు న్యాయం చేసిన ఘనత తమదే అంటూ గొప్పలు చెప్పింది. ఇంతకీ ఎవరెవరికి ఎమ్మెల్సీ స్థానాలు దక్కాయి ? సామాజిక న్యాయం జరిగిందా ? ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎట్టకేలకు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. సామాజిక సమీకరణాలు, మార్పులు చేర్పులు, వడపోతల అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్టును ప్రకటించింది. మొత్తం 18 ఎమ్మెల్సీ స్థానాలకు సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యర్థులను ప్రకటించారు. 18 మంది అభ్యర్థుల్లో 11 మంది బీసీలు ఉండగా.. ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీ, నలుగురు ఓసీలు ఉన్నారు. స్థానిక సంస్థల కోటా కింద తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించగా.. ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు, గవర్నర్ కోటాలో ఇద్దరు అభ్యర్థులను ఖరారు చేసినట్టు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉపముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

వైసీపీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందన్న విషయంలో ఎమ్మెల్సీ పదవుల పంపకం ద్వారా వెల్లడయిందన్నారు. తాము ఎన్నికల కోసం నినాదాలివ్వమని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీలకు పదవులు ఇవ్వడం ద్వార ఎన్నికల హామీ నెరవేర్చినట్టు అయిందని ఆయన చెప్పారు. శాసనమండలిలో బీసీ ఎమ్మెల్సీల సంఖ్య 19కి చేరనుంది. అదే సమయంలో ఓసీల సంఖ్య 14కి చేరనుంది. టీడీపీ హయాంలో ఎస్సీ,ఎస్టీ, బీసీలకు 37 శాతం మాత్రమే పదవులు ఇవ్వగా.. తాము 48 శాతం పదవులు ఇచ్చినట్టు సజ్జల గుర్తు చేశారు. చంద్రబాబు మాటల్లో చెబితే.. జగన్ ఆచరించి చూపారని చెప్పారు.
సామాజిక సమీకరణాల్ని దృష్టిలో ఉంచుకుని వైసీపీ పదవులు కేటాయించినట్టు తెలుస్తోంది. కొన్ని చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా.. అసంతృప్త నేతలకు ఎమ్మెల్సీ పదవి ఎరవేసినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ ఎమ్మెల్సీలు ఆశించిన కొందరికి నిరాశ తప్పలేదు. కేవలం కొంత మందికి మాత్రమే.. అన్ని లెక్కలు సరిచూసుకుని కేటాయించినట్టు తెలుస్తోంది. మరి ఎమ్మెల్సీ ఆశావహులు అధిష్టాన నిర్ణయాన్ని శిరసావహిస్తారా ? ధిక్కరిస్తారా ? వేచిచూడాలి.
-వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ ఇదే..
Announcement of YCP MLC candidates..Announcement of candidates for total 18 MLC seats..OC-4, ST-1, BC-11, SC-2 allotment.. 9 candidates in local body quota, 7 candidates in MLA quota, 2 candidates in Governor quota #MLCElection2023 pic.twitter.com/IxGtOeKMar
— SnarcissistØ 🚩 (@SnarcissistO) February 20, 2023