
YS Viveka Case : వైఎస్ వివేకా కేసులో అందరి వేళ్లు ఇప్పటివరకూ వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. సీబీఐ వారినే అరెస్ట్ చేస్తోంది.. విచారిస్తోంది. ఈ కీలక దశకు చేరిన విచారణలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. వైఎస్ వివేకా రెండో భార్య షమీం బయటకొచ్చింది. మీడియాకు ఎక్కింది. ఆమె సంచలన ప్రకటన చేసింది. సీబీఐకి షమీం ఇచ్చిన డాక్యుమెంట్ లో కీలక విషయాలు ఉన్నాయి. హత్య కు కొన్ని గంటల ముందు తనతో ఫోన్ లో మాట్లాడాడనని.. ఓ బెంగళూరు ల్యాండ్ సెటిల్ మెంట్ 8 కోట్లు గురించి వివేకా మాట్లాడాడని.. వివేక చనిపోయిన తరువాత వివేక ఇంటికి వెలుదామనుకున్నా శివ ప్రకాష్ రెడ్డి మీద భయం తో వెళ్ళలేదంటూ వివేకా రెండో భార్య షమీం చెప్పిన నిజాలు సంచలనమయ్యాయి.
వివేకా రెండో భార్య షమీం బయటకు రావడంతో ఈ కేసులో పెను సంచలనం నమోదైంది. సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, శివప్రకాష్ లవైపు చూపు వెళ్లింది. ఆస్తి, వారసుడు, కుటుంబ గొడవల కారణంగానే ఈ హత్య జరిగినట్టు షమీం ప్రకటనతో అర్థమవుతోంది. ఈకేసులో సీబీఐ అసలు దోషులను వదిలిపెట్టి భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలను అక్రమంగా అరెస్ట్ చేసిందన్న నిజాన్ని షమీం ప్రకటన తేటతెల్లం చేసింది.
వైఎస్ వివేకా హత్యకు అసలు కారణం ఏంటన్నది ఇప్పటి వరకూ బయటపడలేదు. వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిలను బాధ్యులుగా పేర్కొంటూ సీబీఐ అమాయకులను ఈ కేసులో ఇరికించే కుట్ర చేస్తోంది. దీనికి ఆధారాలు ఇచ్చేలా మరో భారీ కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. వైఎస్ వివేకా రెండో భార్య తాజాగా మీడియా ముందుకు వచ్చింది. వివేకా రెండో భార్యకు ఒక కుమారుడు ఉన్నాడు. అతడినే తన వారసుడిగా వైఎస్ వివేకా ప్రకటించడానికి రెడీ అయ్యారు.. బెంగళూరులో ఓ ల్యాండ్ సెటిల్ మెంట్ తో 8 కోట్లు వస్తాయని వివేకా తనకు చెప్పారని.. ఆ కేసులోనూ ఆయనను హత్య చేసి ఉండొచ్చన్న సంచలన విషయాన్ని వివేకా రెండీ భార్య షమీం బయటపెట్టారు. దీంతో ఈ కేసులో భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిల ప్రమేయం లేదని.. వైఎస్ వివేకా కుటుంబ సభ్యులే ఆస్తి కోసం ఈ హత్యకు పాల్పడ్డారా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి.

తెలుగు న్యూస్ చానెల్ తో వివేక రెండో భార్య షమీం ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు సంచలనంగా మారింది. వివేకాతో తనకు 2010 లో వివాహం అయ్యిందని.. 2011లో మరోసారి అధికారికంగా వివాహం చేసుకున్నామని వివేకా రెండో భార్య షమీం పేర్కొంది. 2015 లో షహన్షాన్ మా ఇద్దరికీ పుట్టాడని తెలిపింది. వివేక హత్యకు కొన్ని గంటల ముందు నాతో ఫోన్ లో మాట్లాడాడని.. మా వివాహం వివేకా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని షమీం సంచలన నిజాన్ని బయటపెట్టింది. పలు మార్లు శివ ప్రకాష్ రెడ్డి నన్ను బెదిరించారని.. మా కుటుంబ సభ్యులను బెదిరించే వాడని ఆమె తెలిపింది.
వైఎస్ వివేకాకు దూరంగా ఉండమని సునీత రెడ్డి సైతం బెదిరించేదని షమీం అసలు నిజాన్ని బయటపెట్టింది. వివేకా ఆస్తి మొత్తం సునీత భర్త రాజశేఖర్ కు, వివేకా రాజకీయ పదవిపై శివ ప్రకాష్ కు కాంక్ష ఉండేదని షమీం నిజాలు చెప్పుకొచ్చింది. నా కొడుకు షహన్షా పేరు మీద 4 ఏకరాలు కొందామని వివేకా అనుకున్నా శివ ప్రకాష్ రెడ్డి ఆపేశాడని షమీం పేర్కొంది. వివేకా ను సొంత కుటుంబ సభ్యులే దూరం పెట్టారని.. అన్యాయంగా వివేకా చెక్ పవర్ తొలగించారని షమీం ఆరోపించారు. చెక్ పవర్ తొలగించడంతో వివేక ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడని.. బెంగుళూరు ల్యాండ్ సెటిల్మెంట్ ద్వారా 8 కోట్లు వస్తాయని వివేక నాతో చెప్పాడంటూ తెలిపింది. దీంతో వైఎస్ వివేకా హత్యకు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కంటే కూడా ఈ రెండో భార్యతో ఎఫైర్ ఆస్తి పంపకాలు కారణం కావచ్చన్న ప్రచారం సాగుతోంది. దీనిపై సీబీఐ ఎలా ముందుకెళుతుందన్నది వేచిచూడాలి.
