గ్యాస్ సిలిండర్ ఉన్నవారికి శుభవార్త.. కీలక నిర్ణయం దిశగా మోదీ సర్కార్..?

గడిచిన మూడు నెలల్లో గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 225 రూపాయలు పెరిగిన సంగతి తెలిసిందే. సిలిండర్ ధర అంతకంతకూ పెరుగుతుండటంతో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలపై అదనపు భారం పడుతోంది. గ్యాస్ సిలిండర్ విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌ను మోదీ సర్కార్ మరోసారి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుందని సమాచారం. Also Read: ఎస్బీఐ బంపర్ ఆఫర్.. రుణాలు తీసుకునే మహిళలకు […]

Written By: Navya, Updated On : March 9, 2021 1:32 pm
Follow us on

గడిచిన మూడు నెలల్లో గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 225 రూపాయలు పెరిగిన సంగతి తెలిసిందే. సిలిండర్ ధర అంతకంతకూ పెరుగుతుండటంతో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలపై అదనపు భారం పడుతోంది. గ్యాస్ సిలిండర్ విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌ను మోదీ సర్కార్ మరోసారి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుందని సమాచారం.

Also Read: ఎస్బీఐ బంపర్ ఆఫర్.. రుణాలు తీసుకునే మహిళలకు శుభవార్త..!

8 కోట్ల మంది బీపీఎల్ కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరిగే విధంగా కేంద్రం సిద్ధమవుతోందని నివేదికలు చెబుతున్నాయి. ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రయోజనాలను మరి కొంతకాలం అందించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయాలంటే 800 రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది.

Also Read: రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. ఇలా చేస్తే ఖాతాల్లోకి రూ.4 వేలు..?

2021 – 22 ఆర్థిక సంవత్సరంలో మూడు నెలల పాటు ఫ్రీ గ్యాస్ సిలిండర్లను అందించాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం గ్యాస్ సిలిండర్ ధరల తగ్గింపుపై దృష్టి పెట్టాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు. మరోవైపు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. అమెజాన్ పే ద్వారా గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకున్న వాళ్లకు 50 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

ఫస్ట్ టైమ్ అమెజాన్ ద్వారా సిలిండర్ బుక్ చేస్తే మాత్రమే సిలిండర్ ధరపై 50 రూపాయలు డిస్కౌంట్ పొందవచ్చు. అమెజాన్ పే ద్వారా గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకున్న వాళ్లకు మూడు రోజుల్లోగా అమెజాన్ పే వాలెట్‌ లో డిస్కౌంట్ నగదు జమవుతుంది. 7718955555 నంబర్ కు కాల్ చేయడం ద్వారా ఇండేన్ గ్యాస్ కస్టమర్లు సులభంగా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకోవచ్చు.