https://oktelugu.com/

ఎస్బీఐ బంపర్ ఆఫర్.. రుణాలు తీసుకునే మహిళలకు శుభవార్త..!

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాలు తీసుకునే మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. మహిళా దినోత్సవం సందర్భంగా హోం లోన్ తీసుకునే మహిళలకు భారీ డిస్కౌంట్ ప్రకటించింది. సాధారణంగా ఇచ్చే తగ్గింపుతో పోలిస్తే మహిళలు తీసుకునే హోమ్ లోన్స్ పై మరింత ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నట్టు ఎస్బీఐ కీలక ప్రకటన చేసింది. కొత్తగా హోమ్ లోన్ తీసుకోవాలని భావించే వాళ్లకు బ్యాంక్ తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. Also Read: గ్యాస్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 9, 2021 1:38 pm
    Follow us on

    SBI Home Loans

    దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాలు తీసుకునే మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. మహిళా దినోత్సవం సందర్భంగా హోం లోన్ తీసుకునే మహిళలకు భారీ డిస్కౌంట్ ప్రకటించింది. సాధారణంగా ఇచ్చే తగ్గింపుతో పోలిస్తే మహిళలు తీసుకునే హోమ్ లోన్స్ పై మరింత ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నట్టు ఎస్బీఐ కీలక ప్రకటన చేసింది. కొత్తగా హోమ్ లోన్ తీసుకోవాలని భావించే వాళ్లకు బ్యాంక్ తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

    Also Read: గ్యాస్ సిలిండర్ ఉన్నవారికి శుభవార్త.. కీలక నిర్ణయం దిశగా మోదీ సర్కార్..?

    సాధారణంగా ఇచ్చే వడ్డీరేటుతో పోలిస్తే ఎస్బీఐ అదనంగా 5 బేసిక్ పాయింట్ల మేర రాయితీ కల్పించడం గమనార్హం. కారు లోన్స్ పై కూడా ఎస్బీఐ స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అయితే హోమ్ లోన్ పై తగ్గింపు ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే ఉంటుందని ఆసక్తి ఉన్నవాళ్లు ఈ నెల 31వ తేదీలోపు రుణాలు తీసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. మహిళలు హోమ్ లోన్ తీసుకుంటే మరో బెనిఫిట్ కూడా కలుగుతుంది.

    Also Read: రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. ఇలా చేస్తే ఖాతాల్లోకి రూ.4 వేలు..?

    ఎస్బీఐ హోమ్ లోన్ తీసుకునే వారికి ప్రాసెసింగ్ ఫీజుపై నూటికి నూరు శాతం డిస్కౌంట్ కల్పిస్తోంది. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్ తీసుకునే వాళ్లు ఒక విషయం గుర్తుంచుకోవాలి. బ్యాంక్ లో సిబిల్ స్కోర్ ప్రాతిపదికన రుణ మొత్తం, రుణాలపై వడ్డీరేట్లలో మార్పులు ఉంటాయి. క్రెడిట్ స్కోర్ బాగున్నవారికి అదనపు ప్రయోజనం కల్పించడం ఉత్తమమని ఎస్బీఐ పేర్కొంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    హోమ్ లోన్స్ తీసుకోవాలనే ఆలోచన ఉంటే వెంటనే సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ ను సంప్రదించి లోన్ తీసుకుంటే మంచిది. ఎస్బీఐ అధికారులను సంప్రదించడం ద్వారా హోమ్ లోన్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.