Pawan Kalyan Vs YCP: ‘రెడ్డి’లు.. దివి నుంచి భువికి దిగివచ్చిన వారు కాదు.. ‘రెడ్డి’లు.. దైవాంస సంభూతులు అంతకంటే కాదు.. ‘రెడ్డి’లు రాజ్యాధికారం కోసమే పుట్టినోళ్లు కానేకాదు.. కానీ టైం బాగుండి.. కొంచెం నాయకత్వ లక్షణాలు.. తెలివితేటలు ఉండి.. నలుగురిని పోగే సామర్థ్యం ఉంది.. అగ్రవర్ణం కావడంతో డబ్బులు బాగా ఉండడంతో ప్రజలను కొనేసి అధికారం సంపాదించడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ లో ఇలానే ఎదిగి దోచుకొన్న నేతంలంతా ఇప్పుడు తొడలు కొడుతున్నారు. ‘మాది రెడ్డి’ కులం.. మేమే గొప్పొల్లం అంటూ విర్రవీగుతున్నారు.

-ఏపీ, తెలంగాణలో ‘రెడ్డి’ అహంకారం
మొన్న ఈ మధ్య తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా తమ కుల సంఘం సమావేశంలో అసలు పాలకులు అంటే రెడ్డిలే.. రెడ్డిలే సీఎంలు కావాలి.. వారికే ఆ నాయకత్వ లక్షణాలు ఉంటాయి.. వేరే వాళ్లకు ఉండవు అంటూ నోరుపారేసుకున్నారు. ఇక రాజమండ్రిలో ఓ వైసీపీ నాయకురాలు.. రెడ్డి కుల సమావేశంలో అందంగా ముస్తాబై చిలకపలుకులు పలుకుతూ రెడ్డీలే గొప్ప అంటూ బీరాలకు పోయింది. ‘ఏదైనా పవర్ ఫుల్ గా ఉండాలన్న.. ఏదైనా చేయాలన్న అది రెడ్లకే సాధ్యం. రెడ్డి అంటే ఒక క్యాస్ట్ కాదు.. అది పాలించే పార్టీ. పదిమందికి పెట్టేవాళ్లే రెడ్లు.. తెలుగు నేలను ఎంతో మంది సీఎంలు పరిపాలించారు. ఈరోజుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి చెప్పుకుంటున్నామంటే ఆయన రెడ్డి కావడమే’ అంటూ ఆ లేడీ వైసీపీ నాయకురాలు తమ కులం గురించి బాగా డప్పు కొట్టుకుంది. రెడ్ల గురించి ఈమె చెబుతుంటే కింద రెడ్డి యువత బట్టలు చింపుకుంటూ అరిచిన అరుపులు అంతా ఇంతాకావు. ఈ వీడియో వైరల్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా కులాల వారు కూడా తప్పు పట్టే స్థాయికి చేరింది. ఆనోట ఈనోట పవన్ కళ్యాణ్ వరకూ వీడియో వెళ్లింది.
-డబ్బే రెడ్డిలను నిలబెడుతోంది..
ఆర్థిక బలం, అంగబలం ఉన్నాయి కాబట్టే మీరు నాయకులుగా ఎదుగుతున్నారన్న వాస్తవాన్ని రేవంత్ రెడ్డి మరిచిపోయారు. బీసీలు, దళితులు ఇతర బడుగు బలహీన వర్గాల వద్ద తెలివితేటలు నాయకత్వ లక్షణాలున్నా.. వారికి సరిపడా డబ్బులు లేవు. డబ్బులు లేని సమాజంలో రాజకీయం చేయలేం. ఇప్పుడంతా పైసామే పరమాత్మ. వెరీ కాస్లీ అయినా ఈ రాజకీయంలో పోటీ చేయలన్నా.. గెలవాలన్నా కోట్లు కావాలి. మొన్న మునుగోడులో 400 కోట్ల వరకూ పార్టీలు కుమ్మరించాయంటే పరిస్థితులు ఎంత దిగజారాయో అర్థం చేసుకోవచ్చు.కాంట్రాక్టులు, పారిశ్రామికవేత్తలు మాత్రమే ఎన్నికల్లో పోటీచేసే రోజులు వచ్చాయి. వారిలో మెజార్టీ రెడ్డిలు, కమ్మ, వెలమ దొరలే కావడంతో వారికే సీట్లు పదవులు దక్కుతున్నాయి. ఆ అహంకారంతోనే ‘రెడ్డి’ నేతలు రెచ్చిపోతున్నారు. అహంకారంతో వాగుతున్నారు. అయితే
–డబ్బులుంటేనే ‘రెడ్డి’లు సీఎంలు అయిపోరు.. సంస్కారం ముఖ్యం
కేవలం డబ్బులుంటేనే రెడ్డిలు సీఎంలు అయిపోరు. అణగారినవర్గాల వారు ఇప్పుడు అందలం ఎక్కుతున్నారు. ఒక బీసీ అయిన నరేంద్రమోడీ దేశానికి ప్రధాని అయ్యారు. ఒక గిరిజన ఆదిమ తెగ మహిళ దేశానికి రాష్ట్రపతిగా ప్రథమ మహిళ అయ్యింది. ఇక బీసీ బండి సంజయ్ తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడయ్యాడు. బీజేపీ వచ్చాక సామాన్యులే రాజ్యాన్ని ఏలుతున్నారు. ఢిల్లీలోనూ సామాన్యుడైన కేజ్రీవాల్ సీఎం అయ్యాడు. పంజాబ్ లోనూ గెలిపించాడు. మునుపటిలా డబ్బు కంటే మంచితనం.. బడుగు బలహీన వర్గాలకు అందలం దక్కుతోంది. ఈ రెడ్డి అహంకారానికి చెక్ పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.

-పవన్ కళ్యాణ్ ‘బడుగు బలహీనవర్గాల’ నినాదంతోనే సీఎం పీఠానికి..
రాజమండ్రిలో వైసీపీ నాయకురాలు ముసిముసి నవ్వులతో తన రెడ్డి కుల అహంకారాన్ని ప్రదర్శించిన వీడియోను జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం చూశారు. దానిపై తాజాగా మంగళగిరిలో నిర్వహించిన జనసేన సమావేశంలోనూ పవన్ ప్రస్తావించారు. ‘పాలించడానికి మేమే (రెడ్డిలు).. పాలించాలంటే మేమే.. రెడ్డి సామాజికవర్గమే’ అన్న వైసీపీ నాయకురాలి మాట ఇతర సామాజికవర్గాలను ఎంత బాధ కలిగిస్తుందో వాళ్లకు తెలియదు అంటూ పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఒక వ్యక్తి చేసిన కామెంట్ అది.. ఒక కులం చేసిన కామెంట్ కాదు అది. కానీ ఇది రెడ్డి కులానికి అంటగట్టిపోయింది.. ఇలా వైసీపీ నేతలు రెడ్డి కుల అహంకారాన్ని ప్రదర్శించారంటే అది సకల శాఖల మంత్రి సజ్జల చెప్పారని అనుకోవాలా? దీన్ని వైసీపీ అసలు ఖండించలేదని.. దీన్ని బట్టి వారి కుల అహంకారం ఏ లెవల్ లో ఉందో అర్థం చేసుకోవచ్చని పవన్ అన్నారు. తానైతే ఖండించి అందరి ముందు అన్ని కులాల వారికి క్షమాపణ చెప్పిస్తానని పవన్ అన్నారు.
-అణగారిన వర్గాలకు అధికారమే పవన్ నినాదం
ఇప్పటికే తెలుగునాట రెడ్డిలు, కమ్మ, వెలమ సామాజికవర్గాల వారు అధికారం అనుభవించారు. ఇప్పుడు జనసేనతో పవన్ కళ్యాణ్ తేబోయే అతిపెద్ద మార్పు ఏంటంటే బడుగు బలహీన వర్గాల వారికి అధికారం.. ఇప్పటివరకూ రాజ్యాధికారం దక్కని వారికి పెద్దపీట. సీఎంలు కాని కాపులు, బీసీలు దళితులు , ఎస్టీలకు సీఎం సహా మంత్రి పదవులు దక్కాలి. వారి అసంతృప్తిని పారద్రోలాలి. అణగారిన వర్గాలకు అధికారం ఇచ్చినప్పుడే సమతుల్యత వస్తుంది. జనాల్లో వైషమ్యాలు తగ్గుతాయి. అందుకే పవన్ నుంచి ‘సామాన్యులకే రాజ్యాధికారం’ అన్నపదం వచ్చింది. అగ్రవర్ణాలు అయిన రెడ్డి, కమ్మ, వెలమలకు సీఎం సహా మంత్రి పదవులు ఇవ్వను అని ఖరాఖండీగా చెప్పే ధైర్యం పవన్ సొంతం. ఇప్పటివరకూ ఎవరికైతే రాజ్యాధికారం రాలేదో వారికే ఇస్తానని ధైర్యంగా చెప్పారు జనసేనాని. అందుకే పవన్ ఇప్పుడు బడుగులకు ఆశాదీపంగా కనిపిస్తున్నారు. ‘పవన్ ది ఆత్మగౌరవం నినాదమైతే.. వైసీపీది కుల అహంకారం.. ’ మరి ఈ రెండు నినాదాల్లో ఏది గెలుస్తుంది? ఎవరి కల నెరవేరుతుందన్నది ప్రజల చేతుల్లోనే ఉంది.