Actress Jamuna Passed Away: దాదాపు ఐదు దశాబ్ధాల సినీ ప్రయాణం ఆమెది. ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో కలిసి చేసిన అనుభవం ఆమెది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల ప్రేక్షకుల హఋదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఆమె మరణం ఇప్పుడు సినీ పరిశ్రమను దిగ్బ్రాంతికి గురిచేసింది.

అలనాటి అందాల నటి జమున ఇక లేరు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో కొద్దికాలంగా బాధపడుతున్న జమున శుక్రవారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న జమున హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. జమున లేరనేవార్త సినీ అభిమానులను, సినీ వర్గాలను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆమె మృతికి సినీ ప్రముఖులు, ప్రేక్షకులు సంతాపం తెలిపారు.
జమున వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితాన్ని ఒక్కసారి తరిచి చూస్తే.. 1936 ఆగస్టు 30న హంపిలో జమున జన్మించారు. 1953లో పుట్టిల్లు సినిమాతో జమున సినీ రంగ ప్రవేశం చేశారు. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ సినిమాల్లో నటించారు. సత్యభామ పాత్ర ఆమెకు బాగా గుర్తింపు తీసుకువచ్చింది. మిస్సమ్మ సినిమా జమున సినీ కెరీర్ కు మంచి టర్నింగ్ పాయింట్ గా నిలిచింది.

ఇక ఆమె రాజకీయాల్లోకి కూడా వచ్చారు. 1980లో రాజమండ్రి నుంచి కాంగ్రెస్ ఎంపీగా పోటీచేసి గెలిచారు. వృద్ధాప్యంతో తుదిశ్వాస విడిచిన జమున అంత్యక్రియలను ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ఫిలించాంబర్ కు జమున పార్థీవ దేహాన్ని తీసుకురానున్నారు