
Jana Sena spokesperson Rayapati Aruna : ‘అక్కడున్న సాధారణ మహిళ కాదు.. ఆడపులి.. మేం వెళ్లం.. మాతో కాదు.. ఆ జనసేన వీరమహిళతో తలపడి గెలవలేం..’ అంటూ వైసీపీ అధికార ప్రతినిధులంతా పార్టీ అధిష్టానం ముందు మొరపెట్టుకుంటున్నారట.. ఆమె మాటల వాగ్ధాటిని తట్టుకోవడం కష్టమని చేతులెత్తేశారట.. అంతలా వైసీపీ నేతలను భయపెడుతున్న జనసేన వీరమహిళ గురించే ఇప్పుడంతా చర్చ సాగుతోంది.
అధికార బలం లేకపోవచ్చు.. వైసీపీ నేతల్లా కండబలం ఉండకపోవచ్చు.కానీ బెదిరిస్తే భయపడడానికి ఆమె ఓటరు కాదు.. షూటర్. అవును జనసేన తరుఫున పవన్ కళ్యాణ్ వదిలిన తూటా ఆమె. ఆమె మాటల ఫైరింగ్ కు ఇప్పుడు వైసీపీ బెంబేలెత్తిపోతోంది. మేం ఆమెతో పోటీపడం బాబోయ్ అంటూ జగన్ రైట్ హ్యాండ్.. వైసీపీ పెద్దాయనకు మొర పెట్టుకున్నారట.. టీవీ ఛానెళ్లలో ఆ జనసేన వీరమహిళ’తో వాదించలేకపోతున్నామని.. అభాసుపాలవుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.. ఇంతకీ వైసీపీ అధికార ప్రతినిధులను చెడుగుడు ఆడుకుంటున్న ఆ జనసేన వీరమహిళ ఎవరు? ఆమె కథేంటి? అన్న దానిపై స్పెషల్ ఫోకస్..
-ఎవరీ రాయపాటి అరుణ?
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరానికి చెందిన రాయపాటి అరుణ మొదటి నుంచి ప్రజా సమస్యలపై గళమెత్తుతారు. సాధారణ కుటుంబానికి చెందిన అరుణకు జనసేన భావజాలం.. పవన్ కళ్యాణ్ విధానాలు నచ్చి జనసేనలో చేరారు. అరుణ వాగ్ధాటి, రాజకీయంగా చురుకుదనం చూసిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఆమెకు కీలకమైన పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారు. పార్టీ విధానాలను జనాల్లోకి తీసుకెళ్లడం.. ప్రముఖ ఛానెల్స్ లో జనసేన వాణిని వినిపించడంలో అరుణ గొప్పగా రాణిస్తున్నారు. సమస్పలపై తరుచుగా స్పందిస్తూ అరుణ జనాల్లో, సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. విమర్శలకు ధీటుగా ఎదుర్కొని కౌంటర్ ఇవ్వడం అరుణ బలం. అరుణ కౌంటర్ అటాక్ చూసి పవన్ ఆమెను పోత్సహిస్తున్నారు.
-టీవీ ఛానెళ్లలో వైసీపీని బెంబేలెత్తిస్తున్న అరుణ
రాయపాటి అరుణ కౌంటర్లకు వైసీపీ ఎన్ కౌంటర్ అవుతున్న పరిస్థితి నెలకొంది. ఆమెతో కలిసి డిబేట్ లో పాల్గొన్న వైసీపీ నేతలకు పాయింట్ టు పాయింట్ లేవనెత్తి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అసలు సమాధానం కూడా ఇవ్వనంత డీప్ గా ప్రజాసమస్యలపై.. వైసీపీ వ్యతిరేక విధానాలపై చీల్చిచెండాడుతారు. ఆమె మాటల తూటాలకు ఏ వైసీపీ నేత కూడా టీవీ చానెళ్ల డిబేట్లలో నిలవలేకపోతున్నారట.. అందుకే మేం వెళ్లం ఆమె ఉంటే అని తాజాగా వైసీపీ పెద్దాయన సజ్జల వద్ద వైసీపీ అధికార ప్రతినిధులంతా మొరపెట్టుకున్నారట.. అరుణ టీవీ డిబేట్లలో ఉంటే మేం వెళ్లం అంటూ మూకుమ్మడిగా సజ్జల రామకృష్ణారెడ్డికి తేల్చిచెప్పారట.. అరుణ అడిగే ప్రశ్నలకు తమ వద్ద సమాధానాలు లేవని.. అనవసరంగా లైవ్ లో బఫూన్లం అవుతున్నామని.. వైసీపీ పరువు పోతోందని వారంతా ఏకరువు పెట్టారట.. ఫోన్ చేసి రమ్మని ఆహ్వానిస్తున్న ఛానెల్స్ కు తెగేసి చెబుతున్నారట వైసీపీ అధికార ప్రతినిధులు. ఆమె డిబేట్లో ఉంటే ముందే మాకు చెప్పాలని స్పష్టం చేస్తున్నారట.. ఇలా వైసీపీని తన మాటలతో చర్చల్లో బెంబేలెత్తిస్తోంది అరుణ.
జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడితే వైసీపీ ఎలాగైతే షేక్ అవుతుందో.. ఇప్పుడు ఈ వీరమహిళ రాయపాటి అరుణకు సైతం అలాగే భయపడుతోందట.. పవన్ కళ్యాణ్ ఇప్పటికే అరుణకు పార్టీ పరంగా కీలక బాధ్యతలు అప్పగించారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆమె ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలున్నాయి. అరుణ ఇలానే ధాటిగా సాగితే ఖచ్చితంగా భవిష్యత్తులో గొప్పలీడర్ గా ఎదుగుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజకీయాల్లో మహిళా నేతలు ఉండేది తక్కువ. అలాంటిది జనసేన తరుఫున అరుణ ఖచ్చితంగా తూరుపుముక్కగా అవుతారని ఇందులో ఎలాంటి డౌట్ లేదని జనసైనికులు చెబుతున్నారు.
@RayapatiAruna గారు సబ్జెక్ట్ మాట్లాడుతుంటే టాపిక్ ని డైవర్ట్ చేస్తావెంట్రా వెంకట్ రెడ్డి?
దమ్ముంటే పాయింట్ మాట్లాడ్రా వెంకట్ రెడ్డి. pic.twitter.com/usU4SEx3n5
— JanaSena Samhitha (@JSPSamhitha) February 8, 2023