
Nijam With Smitha- Chiranjeevi : అన్ స్టాపబుల్ ట్రెమండస్ సక్సెస్ నేపథ్యంలో కొత్త కొత్త టాక్ షోలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా సింగర్ స్మిత హోస్ట్ గా నిజం విత్ స్మిత టైటిల్ తో టాక్ షో ప్రారంభం కానుంది. ఇది కొంచెం బోల్డ్ గా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. చిరంజీవి, నాని, రానా, సాయి పల్లవి, చంద్రబాబు నాయుడు వంటి టాప్ సెలెబ్రిటీలు పాల్గొన్నారు. ఫిబ్రవరి 10వ తేదీ నుండి సోనీ లివ్ లో నిజం విత్ స్మిత ప్రసారం కానుంది. ముఖ్యంగా చిరంజీవి ఎపిసోడ్ మరింత రంజుగా సాగే సూచనలు కలవు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన కొన్ని విషయాలు లీకయ్యాయి.
చిరంజీవి వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన విషయాలకు సంబంధించిన అనేక విషయాలు వెల్లడించారట. కెరీర్లో ఎదిగే క్రమంలో ఎదురైన సవాళ్లు, అవమానాల గురించి ఆయన ఓపెన్ అయ్యారని తెలుస్తుంది. పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఒకరోజు ఆయనకు చేదు అనుభవం ఎదురైందట. పబ్లిక్ ఆయన మీద గుడ్లు విసిరారట. అసలు చిరంజీవి మీద గుడ్లు విసిరింది ఎవరు? ఎందుకు విసిరారు? అనేది పూర్తి ఎపిసోడ్ చూస్తే కానీ తెలియదు. అలాగే తన ఫస్ట్ క్రష్ ఎవరో కూడా చిరంజీవి చెప్పారట.
చిరంజీవి జీవితంలో ఎవరికీ తెలియని కొన్ని విషయాలు నిజం విత్ స్మిత షో వేదికగా బయటకు వచ్చాయంటున్నారు. ఎలాంటి సినిమా నేపథ్యం లేని ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు టాలీవుడ్ ని ఏలడం అతిపెద్ద విజయం. అప్పటికే పరిశ్రమలో నాటుకుపోయిన హేమాహేమీలతో తలపడి ఆయన స్టార్ అయ్యారు. చిరంజీవి ఎదుగుదలను ఆపాలని అనేక కుట్రలు కూడా జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఒకసారి చిరంజీవి మీద విషప్రయోగం జరిగింది. అభిమాని అంటూ కేక్ తినిపించిన ఒక వ్యక్తి చిరంజీవి విష ప్రయోగానికి పాల్పడ్డాడని సమాచారం.

సోషల్ మీడియా విప్లవం లేని ఆ రోజుల్లో ప్రింట్ మీడియాను ఫాలో అయ్యేవాళ్ళు కూడా అంతంత మాత్రమే. దాంతో చిరంజీవి పై జరిగిన హత్యాయత్నం పెద్దగా ప్రాచుర్యం కాలేదు. కేవలం కొన్ని మీడియా సంస్థలు మాత్రమే ఈ వార్త రాశాయి. ఎన్టీఆర్ తర్వాత దశాబ్దాలు నంబర్ వన్ హీరోగా ఉన్న ఏకైన స్టార్ చిరంజీవి. 90లలోనే కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న హీరో. బాలీవుడ్ స్టార్ అమితాబ్ కంటే చిరంజీవి రెమ్యూనరేషన్ ఎక్కువని అప్పట్లో ఓ నేషనల్ మీడియా ఈ విషయాన్ని ప్రముఖంగా రాసింది.