స్మార్ట్ ఫోన్ యూజర్లకు శుభవార్త.. పది నిమిషాల్లో ఫుల్ ఛార్జ్..?

సాధారణంగా స్మార్ట్ ఫోన్ ను ఫుల్ ఛార్జ్ చేయాలంటే రెండు గంటల నుంచి మూడు గంటల సమయం పడుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఫోన్లు ఐతే గంట సమయం పడుతుంది. అయితే రాబోయే రోజుల్లో కేవలం పది నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు బ్యాటరీ ఎక్కువ సమయం వినియోగించే వీలు ఉండే ఫోన్లపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో తక్కువ సమయంలో ఛార్జ్ చేసే ఫోన్లపై యూజర్లు […]

Written By: Kusuma Aggunna, Updated On : February 6, 2021 5:36 pm
Follow us on

సాధారణంగా స్మార్ట్ ఫోన్ ను ఫుల్ ఛార్జ్ చేయాలంటే రెండు గంటల నుంచి మూడు గంటల సమయం పడుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఫోన్లు ఐతే గంట సమయం పడుతుంది. అయితే రాబోయే రోజుల్లో కేవలం పది నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు బ్యాటరీ ఎక్కువ సమయం వినియోగించే వీలు ఉండే ఫోన్లపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో తక్కువ సమయంలో ఛార్జ్ చేసే ఫోన్లపై యూజర్లు దృష్టి పెడుతున్నారు.

Also Read: చెప్పులు మధ్యాహ్నం మాత్రమే కొనాలంటున్న డాక్టర్లు.. ఎందుకంటే..?

ఇతర ఫీచర్లతో పోలిస్తే స్మార్ట్ ఫోన్ యూజర్లు బ్యాటరీ కెపాసిటీ, ఫోన్ ఛార్జ్ చేయడానికి పట్టే సమయం గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు వేగంగా ఛార్జింగ్ చేసే టెక్నాలజీలపై దృష్టి పెట్టగా షావోమీ కంపెనీ ప్రస్తుతం 200 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో పని చేసే ఫోన్ ను అభివృద్ధి చేస్తున్నట్టు సమాచారం. ఈ ఏడాదిలోనే ఈ టెక్నాలజీతో పని చేసే ఫోన్ అందుబాటులోకి రానుందని సమాచారం.

Also Read: ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన ఎస్బీఐ..?

షావోమీ సంస్థ ఎం.ఐ ఫోల్డబుల్ పేరుతో ఒక ఫోన్ ను త్వరలో యూజర్ల కొరకు తీసుకురాబోతుందని తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయం తెలియాల్సి ఉంది. షావోమీ 10 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ అయ్యే కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో ఇతర కంపెనీలు సైతం ఈ దిశగా అడుగులు వేస్తూ ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఈ టెక్నాలజీ ప్రయోగాల దశలో ఉన్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

తక్కువ బడ్జెట్ తోనే షావోమీ కంపెనీ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తూ ఉండటంతో స్మార్ట్ ఫోన్ యూజర్లు సైతం ఈ కంపెనీ మొబైల్ ఫోన్లనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. గత కొన్నేళ్ల నుంచి ప్రతి సంవత్సరం అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్ల జాబితాలో షావోమీ ఫోన్లే ముందు వరసలో ఉండటం గమనార్హం.