మనలో చాలామంది చెప్పుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. చెప్పులు కొనుగోలు చేసే సమయంలో లుక్ బాగుంటే ఆ చెప్పులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే సరైన చెప్పులు ఎంచుకోకపోతే పాదాలకు పగుళ్లు ఏర్పడటంతో పాటు కాలి గోర్ల చివరన ఇన్ఫెక్షన్ వస్తుంది. అలాంటి సమస్యలకు ఆయింట్‌మెంట్లు, మందుల కంటే సరైన పాదరక్షలు వినియోగిస్తే మాత్రమే సమస్య నుంచి బయటపడవచ్చు.
Also Read: ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన ఎస్బీఐ..?
వైద్య నిపుణులు దుస్తులకు ఏ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తామో చెప్పులకు కూడా అదే స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలని మధ్యాహ్న సమయంలో మాత్రమే చెప్పులను కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. చెప్పుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తాయని వెల్లడిస్తున్నారు. చెప్పులు కొనే సమయంలో సరైన సైజును ఎంచుకోవాలని తక్కువ సైజు ఎంచుకున్నా, ఎక్కువ సైజు ఎంచుకున్నా ఇబ్బందులు తప్పవని డాక్టర్లు వెల్లడిస్తున్నారు.
Also Read: స్మార్ట్ ఫోన్ యూజర్లకు శుభవార్త.. పది నిమిషాల్లో ఫుల్ ఛార్జ్..?
అయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నా, గుండె సమస్యలు ఉన్నా, మధుమేహం, రక్తపోటు లాంటి సమస్యలు ఉన్నా వారి కాళ్లకు వాపులు ఉంటాయని.. వీళ్లు మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల సమయంలో కొనుగోలు చేయాలని.. ఆ సమయంలో చెప్పులు సాధారణ సైజు కంటే పెద్ద సైజు తీసుకునే అవకాశం ఉండటం వల్ల వాపు ఎక్కువైనా ఎటువంటి సమస్య ఉండదని వైద్యులు తెలుపుతున్నారు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
చిన్న సైజు చెప్పులు వినియోగించడం వల్ల పాదాలకు ఏర్పడే పగుళ్లు దీర్ఘకాలికంగా తగ్గవని.. బిగుతైన షూస్ ధరిస్తే గోర్ల పెరుగుదల మందగిస్తుందని మరీ పెద్ద సైజు చెప్పులు, బూట్లు వేసుకుంటే మడమల సమస్యలు ఎదురవుతాయని వైద్యులు తెలుపుతున్నారు.