Israel-Hamas War : ఇజ్రాయిల్ – హమాస్ యుద్ధంతో పాత క్రూసేడ్ల చరిత్ర పునరావృతమవుతుందా?

ఇజ్రాయిల్ - హమాస్ యుద్ధంతో పాత క్రూసేడ్ల చరిత్ర పునరావృతమవుతుందా? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణ

Written By: NARESH, Updated On : October 14, 2023 5:49 pm

Israel-Hamas War : ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం చూస్తుంటే పాత క్రూసేండ్ల చరిత్ర గుర్తుకు వస్తోంది. జెరూసలేం ఎవరి చేతుల్లో ఉండాలి..? ఎందుకు అన్న దానిపై యుద్ధాలు జరిగాయి. యూదు మతం పుట్టింది అక్కడే. తర్వాత ఏసుక్రీస్తుతో క్రిస్టియానిటీ అక్కడే పుట్టింది. ఆ తర్వాత ముస్లింలకు పవిత్ర స్థలం జెరూసలెం ఇక్కడే ఉంది. అప్పట్లో యూదులు బలంగా ఉండేవారు. క్రీస్తు శకంలో యూదులు చెల్లచెదురయ్యారు. ప్రపంచవ్యాప్తంగా తరలిపోయారు. ఇక క్రిస్టియన్లు మాత్రం తమ మతం పుట్టిన ప్రదేశంగా చూస్తారు. ఇక మహ్మద్ ప్రవక్త దేవుడిగా దగ్గరకు వెళ్లి తిరిగి వచ్చిన ప్రాంతం జెరూసలెం అంటూ ఘర్షణ పడ్డారు. ఇది క్రూసేడ్ల యుద్ధం అంటారు.

ఇది ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం వెనుక వేల ఏళ్ల చరిత్ర ఉంది. దీన్ని ఎవ్వరూ వదిలిపెట్టడానికి ఇష్టపడరు. అప్పుడు క్రిస్టియానిటీ వర్సెస్ ఇస్లాం యుద్ధం జరిగితే.. ఇప్పుడు యూదులు, ముస్లింల మధ్య యుద్ధం జరుగుతోంది. యూదుల వెంట క్రిస్టియన్లు ఉన్నారు.

ఈ యుద్ధం జరగాలని కోరుకుంటున్నది హమాస్ ఉగ్రవాదులు. యూదులు ఎవ్వరూ బతకవద్దని హమాస్ ఉగ్రవాదులు ఒప్పుకోవడం లేదు. ఇస్లాం సమాజంలో మోడరేట్ అయిన వారు ఇజ్రాయిల్ ను గుర్తిస్తూ పాలస్తీన ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్నారు.

ఇజ్రాయిల్ – హమాస్ యుద్ధంతో పాత క్రూసేడ్ల చరిత్ర పునరావృతమవుతుందా? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణ