https://oktelugu.com/

కరోనాకు కొత్త చికిత్స.. 60 శాతం తగ్గిన మరణాలు..?

దేశంలో కరోనా మహమ్మారి కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. మొదట్లో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదైన మహారాష్ట్ర రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే శాస్త్రవేత్తలు కరోనాకు చెక్ పెట్టే దిశగా ప్రయోగాలు చేస్తుండగా ఒక చికిత్స ద్వారా కరోనా మరణాలను 60 శాతం తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది. సోషల్ సైన్స్ రీసెర్చ్ నెట్ వర్క్ అధ్యయనం చేసి ఈ విషయాలను వెల్లడించింది. Also Read: కరోనా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 18, 2021 1:01 pm
    Follow us on

    Corona Virus

    దేశంలో కరోనా మహమ్మారి కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. మొదట్లో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదైన మహారాష్ట్ర రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే శాస్త్రవేత్తలు కరోనాకు చెక్ పెట్టే దిశగా ప్రయోగాలు చేస్తుండగా ఒక చికిత్స ద్వారా కరోనా మరణాలను 60 శాతం తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది. సోషల్ సైన్స్ రీసెర్చ్ నెట్ వర్క్ అధ్యయనం చేసి ఈ విషయాలను వెల్లడించింది.

    Also Read: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి షాక్.. 20 రోజులకు పాజిటివ్‌..?

    విటమిన్ డి ట్రీట్‌మెంట్ ద్వారా కరోనాకు చెక్ పెట్టవచ్చని ఈ అధ్యయనంలో తేలింది. శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం అనంతరం కరోనా రోగులకు చికిత్సలో విటమిన్ డిని వాడాలని సూచించారు. కరోనా వైరస్ చికిత్సలో కాల్సిఫెడియోల్ అనే విటమిన్ డి3 సమర్థవంతంగా పని చేస్తుందని తేలింది. కరోనా బాధితులకు విటమిన్ డి మోతాదును పెంచి ఇవ్వగా విటమిన్ డి తీసుకున్న బాధితులు త్వరగా కోలుకున్నారు.

    Also Read: రూ.4వేలకే కరోనా వ్యాక్సిన్.. ఆఫర్లతో ఫేక్ వెబ్ సైట్.. కేంద్రం కీలక ప్రకటన

    శాస్త్రవేత్తలు కరోనా బాధితుల టెంపరేచర్ సహా లక్షణాల తీవ్రత గురించి అధ్యయనం చేసి ఈ విషయాలను వెల్లడించారు. ఈ చికిత్స ద్వారా వేలాదిమందిని కరోనా బారిన పడకుండా రక్షించవచ్చని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. విటమిన్ డి చికిత్స తీసుకుంటే కరోనా బాధితుల్లో 80 శాతం మందికి వెంటిలేటర్ అవసరం లేదని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

    మరిన్ని వార్తలు కోసం: కరోనా వైరస్

    విటమిన్ డి లోపం ఉన్నవాళ్లే ఎక్కువగా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. మరోవైపు కరోనా వ్యాక్సిన్ పంపిణీ వేగంగా జరుగుతుండటంతో త్వరలోనే ఈ వైరస్ కు చెక్ పెట్టవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.