Allu Arjun : హీరోయిన్ల విషయంలో అల్లు అర్జున్ చెప్పింది.. తన ఇంట్లో వాళ్లే పాటించడం లేదా ??

అందుకే అల్లు అర్జున్ ప్రేక్షకులకు చెప్పిన మాటలే తన ప్రొడక్షన్ హౌస్ కి కూడా ఒకసారి చెబితే తప్పకుండా తరువాత జెనరేషన్ నుంచి అయినా మన తెలుగు అమ్మాయిలు ఒక ఆశతో సీని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్స్ గా ఎదుగుతారని ఆశిద్దాం.

Written By: Swathi, Updated On : July 26, 2023 9:50 pm
Follow us on

Allu Arjun : సినిమాలు అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. అంతేకాదు అబ్బాయిలు కొంతమంది సినిమాలు చూసి హీరోలుగా ఫీల్ అయితే, అమ్మాయిలు హీరోయిన్ల గా ఫీల్ అవుతూ ఉంటారు. చాలామందికి సినిమా యాక్టర్లు అంటే అదొక రకమైన క్రేజ్. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే తమ కొడుకుని హీరోని చేయాలి అనుకునే తల్లిదండ్రులు ఉంటాడు కానీ ఎలాంటి పరిస్థితిలోనూ తన కూతురిని హీరోయిన్ చేయాలి అనుకునే తల్లిదండ్రులు ఉండరు. ఇందుకు అనేక రకమైన కారణాలు ఉన్నాయి. అసలు మన తెలుగు ఇండస్ట్రీ వారే తెలుగు అమ్మాయి హీరోయిన్ అవుతుంది అంటే, సరేలే ఏదో ఒక రెండు మూడు సినిమాలు చేసి వెళ్లిపోతుంది అని ముందుగానే ఫిక్స్ అవుతారు.

అసలు మన తెలుగు అమ్మాయిలు ఏ విషయంలోనూ తీసిపోరు. ముంబాయి వాళ్ళ కన్నా కూడా కళ మన తెలుగు అమ్మాయిల మొహంలో ఉంటుంది. అంతేకాదు తెలుగు అమ్మాయిని తీసుకుంటే ప్రొడ్యూసర్ కి డబ్బింగ్ కాస్ట్ కూడా తగ్గుతుంది. కానీ అలా ఎందుకు తెలుగు ఇండస్ట్రీలో జరగడం లేదు అనేది చాలా మందికి ఉన్న సందేహం.

ముంబై హీరోయిన్లకి దీతుగా మన తెలుగు అమ్మాయిలు అందంగా కనిపించిన, చాలామంది ప్రొడ్యూసర్లకు వాళ్లు కనపడరు. సావిత్రి, వాణిశ్రీ కాలం పక్కన పెడితే, ఆ తరువాత తెలుగు అమ్మాయి అయ్యి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారు చాలా తక్కువ మంది. రోజా, రంభ టైం లో కొంతమంది అన్న మన తెలుగు అమ్మాయిలు పాపులర్ అయ్యారు. ఆ తరువాత అసలు తెలుగు అమ్మాయి అయ్యి స్టార్ హీరోయిన్ అయిన వారు దాదాపు ఎవ్వరు లేరు. లయా లాంటి వాళ్ళు కొన్ని సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్స్ స్టేటస్ అయితే పొందలేదు. కానీ కొన్ని రోజుల నుంచి మాత్రం ఈ పద్ధతి కొంచెం కొంచెం మారుతూ ఉంది. చాందిని చౌదరి, రీతు వర్మ, శోభిత దూళిపాళ్ల, ఈషా రెబ్బ, ప్రియాంక జవాల్కర్ లాంటి వారు కొన్ని సినిమాలు చేస్తూ ఉంటే, మన తెలుగు అమ్మాయి శ్రీ లీల ఏకంగా సెన్సేషన్ స్టార్ అయిపోయింది. అయితే ఇక్కడ మనం గుర్తించుకోవాలిసిన విషయం ఏమిటి అంటే శ్రీ లీలా చేసిన మొదటి సినిమా కూడా తెలుగులో కాదు. అంటే మొదటి ఛాన్స్ మన తెలుగు ప్రొడ్యూసర్లు అయితే ఇవ్వలేదు.

అయితే ఇలా ఎన్ని రోజులు ఎందుకు మన తెలుగు అమ్మాయిలకి అసలు సినిమా ఛాన్సులు రాలేకపోయాయి అనేదానిపైనా చర్చ ఈ మధ్య అల్లు అర్జున్ బేబీ సినిమాలో మాట్లాడిన మాటలు వల్ల మరింత పెరిగింది. ఇండ‌స్ట్రీలో ఎక్కువ‌గా త‌మిళ‌, మ‌ల‌యాళం, క‌న్నడ, ముంబయి అమ్మాయిలే హీరోయిన్లుగా రాణిస్తున్నార‌ని, కానీ తెలుగు అమ్మాయిలు మాత్రం అవ‌కాశాలు ఎక్కువ‌గా రావ‌డం లేద‌ని అల్లు అర్జున్‌ అన్నాడు. తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య నటించిన బేబీ సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ సినీ ప‌రిశ్రమలో తెలుగు అమ్మాయిల రిప్రంజటేషన్ చాలా త‌క్కువ‌గా ఉంద‌ని, ఏదైనా సినిమా అవార్డ్ ఫంక్షన్ వెళితే.. అక్కడ అందరూ ఇతర భాషల హీరోయిన్లే అవార్డు తీసుకుంటున్నారని తన ఆవేదన వ్యక్తం చేశాడు.

తెలుగు అమ్మాయి అయిన శ్రీలీల మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా రాణిస్తుందని, ఇప్పుడు వైష్ణవి కూడా లిస్టులో చేరిపోయిందని చెప్పుకొచ్చాడు.

దీంతో అల్లు అర్జున్ మాటలు విని అందరూ ఆయన చాలా బాగా చెప్పారు అని అంటున్నారు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ఆయన చెప్పిన మాటలు ఆయన ఇంట్లో వారు కూడా పాటించలేదు. ఎందుకు అంటే తెలుగు సినిమాని దాదాపు శాసించేది ముగ్గురి నుంచి నలుగురు ప్రొడ్యూసర్లు అనేది అందరికీ తెలిసిన విషయమే. అందులో దిల్ రాజు తో పాటు దగ్గుబాటి వారు అలానే అల్లు ఫ్యామిలీ వారు ఉన్నారు. నిజంగా ఈ ప్రొడ్యూసర్లు అనుకోకుంటే మన తెలుగు అమ్మాయిలకి వరస ఆఫర్లు ఇచ్చి వారికి స్టార్ స్టేటస్ ఇచ్చి ఉండొచ్చు. సాయి పల్లవి, రష్మిక ఇలాంటి వారికి ఆఫర్లు ఇచ్చినట్టు హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మన తెలుగు అమ్మాయిల కి ఛాన్స్ ఇచ్చి ఉంటే అసలు ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు.

కలర్ ఫోటోలో చాందిని చౌదరి యాక్టింగ్, బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య నటన అలానే ఎన్నో సినిమాలలో రీతు వర్మ అభినయం మరియు అందం, ఎంతోమంది ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్న హీరోయిన్స్ కన్నా కూడా చాలా బాగుంటుంది. మరి ఎందుకు ఈ ప్రొడ్యూసర్ల కి ఈ హీరోయిన్ లు కనపడలేదో. మహానటి, సీతారామం, గీతా గోవిందం లాంటి క్లాసికల్ హిట్ సినిమాల్లో మన తెలుగు అమ్మాయిలు తప్పకుండా ఒదిగిపోయిందే వారు.

అందుకే అల్లు అర్జున్ ప్రేక్షకులకు చెప్పిన మాటలే తన ప్రొడక్షన్ హౌస్ కి కూడా ఒకసారి చెబితే తప్పకుండా తరువాత జెనరేషన్ నుంచి అయినా మన తెలుగు అమ్మాయిలు ఒక ఆశతో సీని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్స్ గా ఎదుగుతారని ఆశిద్దాం.