Palestine issue : ఎందుకు పాలస్తీనా సమస్య పరిష్కారం కావటంలేదు?

ఒప్పందం చేసుకున్న యాసర్ అరాఫత్ ను ద్రోహిగా చిత్రీకరించింది. పాలస్తీనయులు ఇజ్రాయిల్ దేశాన్ని ఒప్పుకోలేదు.

Written By: NARESH, Updated On : October 14, 2023 5:27 pm

Palestine issue : ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం దీన్ని గురించి ఎవరికీ అంతుబట్టడం లేదు. ఇది పెద్ద చరిత్ర. పాలస్తీన సమస్య చాలా సంక్లిష్టమైనది. పాలస్తీన సమస్య ఏంటన్నది చర్చిద్దాం. యూదులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. జర్మనీలో యూదులను ఊచకోత కోశాడు నాటి హిట్లర్. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యూదులను దారుణంగా వెతికి చంపేశాడు. దీంతో యూదులు అంతా వచ్చి ఇజ్రాయిల్ లో సెటిల్ అయ్యారు. ఒక ప్రాంతంగా ఏర్పడ్డారు. అమెరికాలోనూ స్థిరపడ్డారు. ఇజ్రాయిల్ కు వచ్చిన వారంతా తమకు దేశం కావాలంటే.. ‘బ్రిటీష్ ’వాళ్లు ఇజ్రాయిల్ ను ఏర్పాటు చేశారు. ఐక్యరాజ్యసమితి కూడా ఆమోదం తెలిపింది.

ముస్లిం ప్రపంచం మాత్రం ఇజ్రాయిల్ ను ఒప్పుకోలేదు. ఇజ్రాయిల్ పై అరబ్ దేశాలన్నీ కలిసి యుద్ధం చేశాయి. అన్ని యుద్ధాల్లో ఇజ్రాయిల్ గెలిచింది. 1949 కంటే కూడా తన భూభాగాన్ని విస్తరించి బలంగా తయారైంది.

ఈ యుద్ధాలు జరిగి ఓడిపోయిన ముస్లిం దేశాలన్నీ కూడా పగతో రగిలిపోతున్నాయి. తమకు అన్యాయం జరిగింది. అమెరికా మధ్యవర్తిత్వం చేశాయి. నెదర్లాండ్ కూడా చేశాయి. 1993లో పాలస్తీనీయులకు ఒక దేశంగా కావాలని.. వారికి అన్యాయం జరిగిందని అందరూ వాదించారు. యాసర్ అరాఫత్, ఇజ్రాయిల్ మధ్య ఒప్పందం జరిగింది. వెస్ట్ బ్యాంక్, గాజాలు స్వతంత్ర ప్రాంతాలుగా ఏర్పడ్డాయి.

ఒప్పందం చేసుకున్న యాసర్ అరాఫత్ ను ద్రోహిగా చిత్రీకరించింది. పాలస్తీనయులు ఇజ్రాయిల్ దేశాన్ని ఒప్పుకోలేదు. అమెరికా ఒత్తిడితో ఇజ్రాయిల్ కూడా కామ్ గా ఉంది.

ఎందుకు పాలస్తీనా సమస్య పరిష్కారం కావటంలేదు? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.