Fuel Ruling The World: అమెరికా హెచ్చరిస్తున్నా, నాటో ప్రతిఘటిస్తున్నా ఉక్రెయిన్ పై రష్యా ఇంకా ఎందుకు యుద్ధం చేస్తోంది? ప్రపంచానికి పెద్దన్న అమెరికా కరెన్సీ కంటే అరబ్ దేశాల కరెన్సీ కే ఎందుకు విలువ ఎక్కువ? ఇరాన్ ను, ఇరాక్ ను అమెరికా సర్వనాశనం చేసినా ఎలా కోలుకుంటున్నాయి? ఇన్ని ప్రశ్నలకు సమాధానం చమురు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని పెద్దలు అంటారు. కానీ ఆ దీపం దేదీప్యమానంగా వెలగాలంటే చమురు అవసరం. ప్రస్తుతం అలాంటి చమురు ఉన్న దేశాలు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. యుద్ధాలకు, అనూహ్య రాజకీయ పరిణామాలకు నాంది అవుతున్నాయి.

..
నాలుగు కోట్ల డాలర్లు
…
అర్థమైందా అవసరాలకు ఏటా ఆయా దేశాలు వెచ్చిస్తున్న మొత్తం నాలుగు కోట్ల డాలర్లు. ఇవి ఇంచుమించు 40 పేద దేశాల వార్షిక బడ్జెట్ లకు సమానం. ఈ స్థాయిలో రాబడి ఉంది కనుక ఆయిల్ ఉత్పత్తి చేస్తున్న దేశాలు అంతకంతకు అభివృద్ధి చెందుతున్నాయి. ఇక
ప్రపంచం ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా నేటికీ ఇంధన ఆధారిత వాహనాలే ఎక్కువ. అందువల్లే ఆయా దేశాలు తమ పౌరుల సౌకర్యార్థం ఉత్పత్తి అయ్యే దేశాల నుంచి ఇంధనం కొనుగోలు చేస్తాయి. ఓపెక్ ( ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్) దేశాలు ఇంధనాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటాయి. అరబ్ దేశాలే ఓపెక్ కూటమిగా ఏర్పడ్డాయి. రష్యా కూడా అతిపెద్ద ఇంధన సరఫరాదారుగా ఉంది. ఆయా దేశాల కరెన్సీ విలువను చమురు ధరలు నిర్దేశిస్తాయి. ఇంధన ధరలు తగ్గినప్పుడే స్టాక్ మార్కెట్ సూచీలు పైకి లేస్తాయి. దీనివల్ల మదుపర్లు మరింత పెట్టుబడులు పెట్టి విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెంచుతారు.
…
యుద్ధాల వల్ల ధరలు అమాంతం పైపైకి
…
ఇండియన్ కరెన్సీ బేల చూపులు చూస్తోంది. జీవితకాల కనిష్టానికి రూపాయి పడిపోయింది. పతనం ఇంకా ఎంత దాకా కొనసాగుతుందో తెలీదు. ఆర్బీఐ రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు చేపట్టినా ప్రయోజనం అంతంతే. రూపాయి విలువ పడిపోవడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగింది. ముఖ్యంగా ఇండియా నుంచి ఇతర దేశాలకు చదువుల నిమిత్తం వెళ్లే విద్యార్థులకు రూపాయి విలువ పడిపోవడం శరాఘాతంగా పరిణమించింది. దీని అందటికి కారణం రష్యా ఉక్రెయిన్ పై సైనిక చర్యకు దిగడమే. రష్యా భారతదేశానికి ప్రధాన ఇంధన ఎగుమతి దారు. అది అధికారంలోకి వచ్చిన తర్వాత ఒపెక్ దేశాలు చమురు సరఫరాలో అనేక కొర్రీలు పెడుతున్నాయి. పైగా భారతదేశంలో జరుగుతున్న పరిణామాలను బూచీగా చూపి ఇబ్బందులు పెడుతున్నాయి. ఈ తరుణంలో భారత్ రష్యాతో ఉన్న పూర్వ ధైత్యబంధాన్ని పున: ప్రారంభించింది. దీనివల్ల ఆ దేశం ఇండియాకు ఇంధన సరఫరాను ప్రారంభించింది. ఫలితంగా ఒపెక్ దేశాల అహం దెబ్బతిన్నది. లోనే భారతదేశంలో పలు విద్వేషాలను రగిల్చేందుకు కుట్ర పన్నాయి. రైతు చట్టాల కు వ్యతిరేకంగా నిరసన, సీఏఏ,ఎన్ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు ఇందులో భాగమే. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం కావడంతో చమురు ధరలు అమాంతం పెరిగాయి. దీంతో రూపాయి మారక విలువ అంతకంతకు పడిపోయింది. విదేశీ మదుపుదారులు అమ్మకాలకు పూనుకోవడంతో విదేశీ మార్గ ద్రవ్య నిలువలు తగ్గుతున్నాయి. ఈ క్రమంలోనే మోదీ దౌత్యం వహించి పుతిన్ తో చర్చలు జరపడంతో రష్యా చమురు సరఫరా చేసేందుకు ముందుకు వచ్చింది.

Also Read: MS Dhoni Love Story: ధోని-సాక్షి మధ్య ప్రేమ ఎలా పుట్టిందో తెలుసా?
…
విపత్కర పరిస్థితులకు చమురే కారణం
..
బయట ప్రపంచానికి అమెరికా ఎన్ని కారణాలు చెప్పినా ఇరాక్, ఇరాన్ పై యుద్ధాలు చేసేందుకు అసలు కారణం చమురే. తనను కాదని ఇతర దేశాలకు చమురు ఎగుమతి చేస్తే ఊరుకోబోనని హెచ్చరించిన అమెరికా.. ఆయా దేశాల్లోని ఆయిల్ బావులపై, గ్యాస్ సరఫరా చేసే పైప్లైన్లపై క్షపణులు ప్రయోగించి అస్తవ్యస్తం చేసింది. మరో దేశాలైతే కోలుకోవడానికి కొన్ని ఏళ్లు పట్టేది. కానీ అపారమైన చమురు నిల్వలు ఉండటంతో ఇరాన్, ఇరాక్ కోలుకున్నాయి. తన అడుగులకు మడుగులు వత్తే ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంతో అమెరికా ఆటలు ఆయా దేశాల్లో సాగుతున్నాయి.
…
యూపీఏ హయాంలోనూ
…
యూపీఏ హయాంలో కృష్ణా గోదావరి బేసిన్ లో గ్యాస్ నిక్షేపాలను దక్కించుకునేందుకు రిలయన్స్ కంపెనీ చేయని ప్రయత్నం అంటూ లేదు. రిలయన్స్ దాష్టికానికి అప్పటి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్ రెడ్డి మోకాలడ్డారు. అప్పటికే యూపీఏను తెర వెనుక శాసిస్తున్న అంబానీ చక్రం తిప్పారు. నేరుగా సోనియా గాంధీని రంగంలోకి దింపారు. ఫలితంగా రాత్రికి రాత్రే జయపాల్ రెడ్డి శాఖ మారింది. ఆయన స్థానంలో ఇంకో మంత్రి రావడంతో రిలయన్స్ కంపెనీకి కృష్ణ గోదావరి గ్యాస్ బేసిన్ దక్కింది. ఇక అప్పటినుంచి ఇప్పటిదాకా రిలయన్స్ కు అడ్డు అదుపు లేకుండా పోయింది. కేవలం ఈ ఒక్క గ్యాస్ నిక్షేపాల ద్వారా ఆశయాలను అత్యంత ధనవంతుడిగా ముకేశ్ అంబానీ చరిత్ర కు ఎక్కాడు.
Also Read: Rainy Season: వర్షాకాలంలో ఆ నాలుగు కూరగాయలు తినకూడదా?