Avoid Eating Pani Puri: పానీ పూరీ పేరు చెబితే చాలు కొందరు చిన్నారులు అమితంగా ఇష్టపడి తింటారు. సాయంత్రం సరదాగా బయటికి వెళ్లిన పెద్దలు కూడా వీటి రుచి చూడకుండా ఉండలేరు. ఇవి ఎక్కువగా రోడ్ సైడ్ బండ్లలో ఇవి లభించడంతో కొందరు కార్లలో దిగి మరీ ఇష్టంగా తింటారు. అయితే ఇప్పుడు ఆ పానీ పూరి ఆరోగ్యానికే ప్రమాదం అని అంటున్నారు. తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో పానీ పూరి తినకపోవడం బెటరని సూచిస్తున్నారు. వర్షాలు వీపరీతంగా కురుస్తున్న నేపథ్యంలో నీరు కలుషితంగా మారుతుందని, దీంతో లేని రోగాలను కొని తెచ్చుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

‘మీరు రూ.10 నుంచి 15 రూపాయల మాత్రమే ఖర్చు చేస్తారు. కానీ ఆ తరువాత 50 వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు అవుతాయని ’ తెలంగాణ హెల్త్ డైరెక్టర్ తీవ్ర హెచ్చరికలు చేశారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా పట్టి పీడించిందన్నారు. అయితే ఇప్పుడు కరోనా తీవ్రత లేకున్నా సీజన్ వ్యాధులతో పోరాడాల్సి ఉందన్నారు. వర్షాల నేపథ్యంలో నీరు ఎక్కువగా కలుషితంగా మారే ప్రమాదం ఉందని, అందువల్ల నీటిని తీసుకునేటప్పుడు పలు జాగ్రత్తలు పాటించాలంటున్నారు. నీరు, ఆహారం కలుషితం అయితే జ్వరాలు వస్తాయని చెబుతున్నారు.
Also Read: Draupadi Murmu Telangana Tour Cancelled: తెలంగాణను అవమానిస్తున్న బీజేపీ.. ఇలా రివేంజ్ నా?
పానీ పూరి తిన్న తరువాత జర్వం వస్తే నిర్లక్ష్యం చేయొద్దని అంటున్నారు. వరుసగా మూడు రోజులు జ్వరం వస్తే వైద్యులను సంప్రదించాలని అంటున్నారు. రాష్ట్రంలో మలేరియా, డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయని వీటికి వాతావరణంలో మార్పులే కారణమని తెలిపారు. ఒక్కనెలలోనే 6 వేల డయేరియా కేసులు, 563 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని తెలిపారు. అలాగే జనవరి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 1,184 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని తెలిపారు. దాదాపు అన్ని జిల్లాల్లో డెంగ్యూ ప్రభావం ఉందని అయన అన్నారు. ఇక ఆరువారాల్లో కోవిడ్ కేసుల సంఖ్య పెరిగినప్పటికీ అవి సాధారణమేనని అన్నారు. ప్రస్తుతం కోవిడ్ స్థానిక దశలోకి ప్రవేవించిందని పేర్కొన్నారు.

ఇక జ్వరాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం కావాలని సూచించారు. యాంటీ లార్వా ఆపరేషన్లు ముమ్మరం చేయాలన్నారు. దోమలబెడద నిర్మూలనకు ప్రతి శుక్రవారం డ్రై డే గా పాటించాలని ప్రజలను కోరారు. ఇక ప్రజలు వేడి చేసిన నీటిని మాత్రమే తీసుకోవాలని సూచంచారు. ప్రతి ఇంటి వద్ద ఎలాంటి చెత్తా చెదారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అందుకే ఇక రోడ్ సైడ్ కానీ.. బయట షాపుల్లో కానీ పానీ పూరి తినేముందు కాస్తంత జాగ్రత్త అవసరం. అసలు ఈ వానాకాలంలో నీరంతా కలుషితం అయ్యి ఉంటుందని బయట ఫుడ్ తినకపోవడమే మంచిది అంటున్నారు. ముఖ్యంగా పానీ పూరి లాంటివి అస్సలు తినవద్దని వైద్యులు కూడా సూచిస్తున్నారు. మరి మీ జిహ్వచాపల్యాన్ని కంట్రోల్ చేసుకొని ఉంటారా? లేక తినేసి వ్యాధుల బారినపడుతారా? అన్నది మీ ఇష్టం.
[…] Also Read: Avoid Eating Pani Puri: డేంజర్: పానీపూరిని ఎందుకు తి… […]