https://oktelugu.com/

BJP-BJD : ఒడిశాలో బీజేపీ-బీజేడీ కూటమి ఎవరికి లాభం?

ఒడిశాలో బీజేపీ -బీజేడీ కూటమి ఎవరికి లాభం? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : March 9, 2024 / 04:20 PM IST

    BJP-BJD : దేశంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. మనం ఒడిశాలో ఏం జరుగుతుందో సమీక్షించుకుందాం.. ఒడిశాలోని అధికార బీజేపీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్య పొత్తు కుదురుతోంది. స్నేహ బంధం కుదురుతోంది. ఇది ఎన్నికల మైత్రీగా మారబోతోంది.

    సీట్ల దగ్గర గొడవ తాజాగా వచ్చిందని సమాచారం. సీట్ల మధ్యన అయితే కాంప్రమైజ్ అయిపోయి పొత్తు పొడవచ్చు. వీరిద్దరూ కలిసి పోటీచేయాలనుకోవడం ఏమేరకు కరెక్ట్. బిజూ జనతదళ్ అనేది జనతాదళ్ నుంచి 1997లో చీలి ప్రాంతీయ పార్టీ ఏర్పడింది. నవీన్ పట్నాయక్ నాన్న బిజు పట్నాయక్ పేరు మీద ఏర్పడిన పార్టీ..

    1997 నుంచి 2008 దాకా బీజేపీ+బీజేపీ కలిసే ఎన్నికల్లో పోటీచేశాయి. 2008లో ఆదివాసీలను క్రిస్టియన్లుగా మార్చుతున్నారని హింస చెలరేగి చాలా మంది చనిపోయారు. దీనిపై ఆర్ఎస్ఎస్ పోరుబాటు పట్టింది. దీంతో బీజేపీతో బీజేడీ తెగదెంపులు చేసుకుంది.

    2009 నుంచి 2024 వరకూ 15 ఏళ్లు ప్రత్యేకంగానే పోటీచేసి గెలిచింది. బీజేడీ తర్వాత ఒడిశాలో బీజేపీ బలపడింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఇక ప్రధానిగా మోడీ అయ్యాక ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో స్నేహం బలపడింది. ఇద్దరూ సహకరించుకున్నారు. ఇప్పుడు మరోసారి ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయి..

    ఒడిశాలో బీజేపీ -బీజేడీ కూటమి ఎవరికి లాభం? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.