https://oktelugu.com/

NBK 109: బాలయ్య ‘ఎన్ బికే 109’ సినిమా స్టోరీ లీక్…అసలు కథ ఇదేనా..?

గ్లిమ్స్ లో బాలయ్య చాలా కొత్తగా కనిపించడమే కాకుండా ఈ సినిమాని బాబీ చాలా స్టైలిష్ గా తెరకెక్కిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్ర లో బాలయ్య కనిపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : March 9, 2024 / 04:17 PM IST

    NBK 109 movie story leaked

    Follow us on

    NBK 109: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటసింహం గా గుర్తింపు పొందిన బాలయ్య బాబు ఇప్పుడు వరుసగా సినిమాలైతే చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఇప్పటికే వరుసగా హ్యాట్రిక్ హిట్లను కొట్టి ఇప్పుడు నాలుగు సక్సెస్ ని అందుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇక సీనియర్ హీరోలందరి కంటే బాలయ్య ఒక అడుగు ముందుగానే ఉన్నాడు. ఇక అందులో భాగంగానే ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో ‘ఎన్ బి కే 109′(NBK 109) అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమాని చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ ను కూడా ‘మహాశివరాత్రి ‘ కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

    అయితే ఈ గ్లిమ్స్ లో బాలయ్య చాలా కొత్తగా కనిపించడమే కాకుండా ఈ సినిమాని బాబీ చాలా స్టైలిష్ గా తెరకెక్కిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్ర లో బాలయ్య కనిపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమా తో మరో భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంటాడు అనేది పక్కాగా తెలిసిపోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ ఏంటంటే బాలయ్య ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తాడట ఆ అమ్మాయిని కొంతమంది రౌడీలు చంపేస్తారట. ఇక దానికి సంబంధించి ఆ మర్డర్ లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరిని చంపడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉంటాడట. అయితే దీంట్లో డ్రామా గాని, ఎమోషనల్ సీన్స్ కానీ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

    మరి ఈ సినిమాతో బాబీ బాలయ్యకి ఎలాంటి సక్సెస్ ని అందిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇంతకు ముందు చిరంజీవి లాంటి స్టార్ హీరోతో ‘వాల్తేరు వీరయ్య ‘ అనే సినిమా తీసి 250 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టాడు. ఇక బాలయ్య బాబు సినిమాతో 300 కోట్లు రాబట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక మొత్తానికైతే బాబీ వరుసగా సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తూ సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకుంటున్నాడు. ఇక ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ సాధించినట్టయితే బాబీకి మంచి అవకాశాలు వస్తాయి అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…