https://oktelugu.com/

తులసి మొక్కకు శాపం పెట్టిన వినాయకుడు.. కారణం ఇదే!

మన పూర్వీకుల నుంచి ప్రతి ఒక్కరి ఇంటి ఆవరణంలో తులసి మొక్క కనిపిస్తుంది. ఈ తులసి మొక్కను పూర్వకాలం నుంచి ఎంతో పరమ పవిత్రమైన దేవతా వృక్షం గా పూజిస్తారు. అయితే తులసి మొక్క పూర్వజన్మలో ఒక స్త్రీ అని మీకు తెలుసా? అవును తులసి మొక్క క్రిందటి జన్మలో ఒక అందమైన స్త్రీగా అవతరించింది.అయితే వినాయకుడు పెట్టిన శాపం వల్ల ఆమె తర్వాత జన్మలో తులసి మొక్కగా ఏర్పడి విశేష పూజలను అందుకుంటుంది. అయితే వినాయకుడు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 1, 2021 / 11:26 AM IST
    Follow us on

    మన పూర్వీకుల నుంచి ప్రతి ఒక్కరి ఇంటి ఆవరణంలో తులసి మొక్క కనిపిస్తుంది. ఈ తులసి మొక్కను పూర్వకాలం నుంచి ఎంతో పరమ పవిత్రమైన దేవతా వృక్షం గా పూజిస్తారు. అయితే తులసి మొక్క పూర్వజన్మలో ఒక స్త్రీ అని మీకు తెలుసా? అవును తులసి మొక్క క్రిందటి జన్మలో ఒక అందమైన స్త్రీగా అవతరించింది.అయితే వినాయకుడు పెట్టిన శాపం వల్ల ఆమె తర్వాత జన్మలో తులసి మొక్కగా ఏర్పడి విశేష పూజలను అందుకుంటుంది. అయితే వినాయకుడు తులసికి శాపం పెట్టడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం….

    Also Read: 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు !

    పూర్వం వినాయకుడు ఓ నది ఒడ్డున తపస్సు చేస్తుండగా అతనిని చూసిన తులసి అనే మహిళ తనని పెళ్లి చేసుకోవాలని వినాయకుడికి తెలుపుతుంది. అందుకు నిరాకరించిన వినాయకునికి తులసి నీ పెళ్లి ఎంతో బలవంతంగా జరుగుతుందని ఇష్టప్రకారం జరగదని వినాయకుడికి శాపం పెడుతుంది. కోపంతో ఉన్న వినాయకుడు తులసి కూడా ఒక శాపాన్ని పెడతాడు. నీ వివాహం ఒక రాక్షసుడితో జరుగుతుంది. ఎన్నో కష్టాలను అనుభవిస్తారని శాపం పెడతాడు తరువాత కొద్దిసేపటికే తన తప్పును గ్రహించిన తనకు శాపవిమోచనం కలిగించమని వినాయకుని ప్రాధేయ పడుతోంది. అప్పుడు వినాయకుడు శాపవిమోచనం ఉండదని, వచ్చే జన్మలో తులసి మొక్కగా అవతరించి ఎన్నో పూజలను అందుకుంటావని వరమిస్తాడు.

    Also Read: రైలు ప్రయాణికులకు శుభవార్త.. సులభంగా టికెట్లు బుక్ చేసుకునే ఛాన్స్..?

    అనంతరం తులసీ శంఖచూడ అనే ఒక రాక్షసుని పెళ్లి చేసుకొని కష్టాలను అనుభవించి మరణిస్తుంది. తరువాత జన్మలో తులసి మొక్కగా అవతరించి ప్రత్యేక పూజలను అందుకుంటుంది. అంతేకాకుండా తులసిదళాలు లేనిదే ఆ విష్ణు భగవానుని కి పూజ చేయరు. తులసి ఆకులు లేనిది విష్ణుమూర్తి పూజ పూర్తవదు. ఇంత విశిష్టత కలిగి ఉన్న తులసి ఆకులను వినాయకుని పూజకు ఉపయోగించరు. అంతేకాకుండా ఈ తులసి మొక్కలు ఎన్నో ఔషధ గుణాలు కూడా కలిగి ఉన్నాయని మనకు తెలిసిందే.

    మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం