India vs England : ఇంగ్లాండ్ తో ఆడే మొదటి 2 టెస్ట్ లకు కోహ్లీని రీప్లేస్ చేసే ప్లేయర్ దొరికాడు…

. కాబట్టి తనని టీం లోకి తీసుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి...మరి వీళ్లందరిలో ఎవరిని టీం లోకి తీసుకుంటారు అనేది తెలియాలంటే మరొక రెండు రోజులపాటు వెయిట్ చేయక తప్పదు...

Written By: Gopi, Updated On : January 23, 2024 1:13 pm
Follow us on

India vs England : ప్రస్తుతం ఇండియన్ టీం ఇంగ్లాండ్ తో 5 టెస్ట్ మ్యాచ్ లు ఆడటానికి రంగం సిద్దం చేసుకుంటుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ ఈనెల 25 వ తేదీన హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం లో జరగనుంది. ఇక రెండో టెస్టు విశాఖపట్నంలో జరుగుతుంది. అయితే ఇండియన్ టీం లో దిగ్గజ క్రికెటర్ గా పేరుపొందిన విరాట్ కోహ్లీ మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లకి దూరమవుతున్న విషయం బిసిసిఐ రీసెంట్ గా ప్రకటించింది. ఇక అందులో భాగంగానే కోహ్లీ ప్లేస్ ని రీప్లేస్ చేసే ప్లేయర్ ఎవరు అనే దాని మీద కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఎందుకంటే కోహ్లీ ప్లేస్ ని రీప్లేస్ చేసే ప్లేయర్ అంటే చాలా ఘట్స్ ఉన్న ప్లేయర్ కావాలి. ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపించే సత్తా ఉన్న కోహ్లీ ని రీప్లేస్ చేయడం అంటే మామూలు విషయం కాదు. టీమ్ లోకి వచ్చే ప్లేయర్ బాగా రాణించాలి లేకపోతే మాత్రం ఆ ప్లేయర్ ని తీసుకున్నందుకు బిసిసిఐ మీద, కోచ్ మీద భారీ విమర్శలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే కోహ్లీ ప్లేస్ లో ఆడటానికి ప్రముఖంగా ముగ్గురు ప్లేయర్లు పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఎవరు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం…

ప్రస్తుతం రంజీ లో ఇండియన్ టీమ్ ఇంగ్లాండ్ తో రెండు వర్మాప్ మ్యాచ్ లను ఆడింది. అందులో ఇండియన్ ప్లేయర్ అయిన సర్ఫరాజ్ ఖాన్ వరుసగా ఒక మ్యాచ్ లో 96 పరుగులు, మరొక మ్యాచ్ లో 55 పరుగులు చేసి తన సత్తాని చాటుకున్నాడు. అలాగే తను ఇంతకు ముందు ఆడిన రంజీ మ్యాచ్ ల్లో కూడా ఒకసారి 154, 122, 91 పరుగులను చేసి చాలా అద్భుతమైన ఫామ్ లో ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. ఇక ఈయన తో పాటు రజత్ పటిదర్ కూడా ఇంగ్లాండ్ తో ఆడిన రెండు వార్మప్ మ్యాచ్ ల్లో రెండు సెంచరీలు చేశాడు. ఒక మ్యాచ్ లో151, మరొక మ్యాచ్ 111 పరుగులు చేశాడు. ఈయన స్పిన్, పేస్ బౌలింగ్ ని ఎక్కువగా ఎదుర్కుంటూ పరుగులు రాబడుతూ క్రీజ్ లో ఎక్కువసేపు ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈయన అయితే కోహ్లీ ప్లేస్ ని రీప్లేస్ చేయగలరని కొంతమంది భావిస్తున్నారు. ఇక అలాగే ఇండియన్ టీమ్ లో సీనియర్ ప్లేయర్ అయిన పుజార కూడా జార్ఖండ్ పైన డబుల్ సెంచరీ చేసి మరోసారి తన సత్తాను చాటుకున్నాడు. మరి పూజార టీం లోకి వస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఈ లిస్టులో గోవాకు చెందిన సుహాస్ ప్రభుదేశాయి కూడా ఉన్నాడు. ఆయన ఈ సంవత్సరంలో ఇప్పటివరకు మూడు మ్యాచ్ లను ఆడితే అందులో రెండు సెంచరీలు చేసి మంచి ఫామ్ లో ఉన్నాడు. కాబట్టి తనని టీం లోకి తీసుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి…మరి వీళ్లందరిలో ఎవరిని టీం లోకి తీసుకుంటారు అనేది తెలియాలంటే మరొక రెండు రోజులపాటు వెయిట్ చేయక తప్పదు…