Cake Cutting : కేక్ కట్ చేసేటప్పుడు చేయకూడని తప్పులేంటో మీకు తెలుసా?

క్ తినడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. అయిన చాలామంది వీటిని ఇష్టంగా తింటారు. కేక్‌లను ఎక్కువగా మైదా పిండితో చేస్తుంటారు. మైదా పిండి అసలు ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ విషయం తెలిసిన ఎక్కువగా బేకింగ్ చేసిన ఐటెమ్స్ తింటుంటారు. ఇదంతా పక్కన పెడితే.. కేక్ కట్ చేసేటప్పుడు ఎవరూ చేయకూడని తప్పులేంటో మరి చూద్దాం.

Written By: Srinivas, Updated On : September 26, 2024 7:46 pm

Cake Cutting

Follow us on

Cake Cutting :  ఈరోజుల్లో బర్త్ డే, మ్యారేజ్ డే, యానివర్సరీ డే, ఫంక్షన్లు ఉన్నా, ఏదైనా గొప్పగా సాధించిన కూడా కేక్ కట్ చేస్తుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే వేడుక ఏదైనా కూడా కేక్ కట్ అయితే తప్పనిసరి. ఇంతకు ముందు రోజుల్లో ఇలా కేక్ కటింగ్‌లు ఉండేవి కాదు. ఇప్పుడు ఇవన్నీ ఫ్యాషన్ అయిపోయాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ కూడా ప్రతి చిన్న వేడుకకు కేక్ కట్ చేస్తారు. అయితే కేక్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. కానీ ఆ తప్పులేంటో వాళ్లకి కూడా తెలియదు. కేక్ తినడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. అయిన చాలామంది వీటిని ఇష్టంగా తింటారు. కేక్‌లను ఎక్కువగా మైదా పిండితో చేస్తుంటారు. మైదా పిండి అసలు ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ విషయం తెలిసిన ఎక్కువగా బేకింగ్ చేసిన ఐటెమ్స్ తింటుంటారు. ఇదంతా పక్కన పెడితే.. కేక్ కట్ చేసేటప్పుడు ఎవరూ చేయకూడని తప్పులేంటో మరి చూద్దాం.

కేక్ కట్ చేసేటప్పుడు కొందరు వాటిపై కొవ్వొత్తులు లేదా చిన్న డిజైన్ క్యాండిల్స్ వంటివి పెడుతుంటారు. వీటిని నోటితో ఊది వేడుకను సెలెబ్రేట్ చేసుకుంటారు. అయితే కొవ్వొత్తులను ఇలా ఊదడం అంత మంచిది కాదని వైద్య నిపుణులు అంటున్నారు. ఊదేటప్పుడు నోటిలోని లాలాజలం నుంచి హానికర బ్యాక్టీరియా విడుదల అయ్యి అది కేక్‌ మీద ఉంటుంది. ఆ బ్యాక్టీరియా కొవ్వొత్తుల మీద ఉండి.. కరిగి కేక్ మొత్తం వ్యాపిస్తుంది. ఈ కేక్‌ను తినడం వల్ల బ్యాక్టీరియా కడుపులోకి వెళ్తుంది. అలాగే కొవ్వొత్తుల్లోని రసాయనాలు కడుపులోకి చేరడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. కేక్ కట్ చేసేటప్పుడు ఇలాంటి తప్పులు చేయకపోతే బెటర్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే. లేకపోతే సమస్య ఇంకా తీవ్రం అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

బేకింగ్ చేసిన పదార్థాలు ఆరోగ్యానికి అంత మంచివి కాదు. వీటిని అధికంగా తినడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు, డయాబెటిస్, బీపీ వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లోనే తయారు చేసుకునే తింటే పర్లేదు. కానీ బయట దొరికే వీటిని తినడం వల్ల కోరి అనారోగ్య సమస్యలు తెచ్చుకున్నట్లే. ఎన్నో రోజులు నిల్వ ఉంచి.. వీటిని తయారు చేస్తారు. వీటిని తినడం వల్ల అనారోగ్యమైన కొవ్వు బాడీలోకి ఎక్కువగా చేరుతుంది. దీనివల్ల తొందరగా బరువు పెరుగుతారు. ఆ కేక్‌లు శరీరానికి బలాన్ని కూడా ఇవ్వవు. ఎప్పుడో ఒకసారి తింటే పర్లేదు. కానీ ఎక్కువ సార్లు తినడం వల్ల దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.