Homeహెల్త్‌Drinking Water : బాడీలో సరిపడా నీరు లేకపోతే.. కనిపించే లక్షణాలు ఇవే!

Drinking Water : బాడీలో సరిపడా నీరు లేకపోతే.. కనిపించే లక్షణాలు ఇవే!

Drinking Water :  నీరు లేకపోతే ఏ ప్రాణి ఉండలేదు. బాడీకి సరిపడా నీరు తప్పనిసరి. తినడానికి ఫుడ్ ఎంత ముఖ్యమో.. నీరు కూడా అంతే ముఖ్యం. ఎక్కువగా నీరు తాగిన ప్రమాదమే.. తక్కువగా తాగిన ప్రమాదమే. బాడీకి సరిపడా నీరు అనేది తప్పకుండా తాగాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. సరిపడా నీరు బాడీకి అందకపోతే చాలా సమస్యలను ఎదుర్కోవాలి. అయితే మీ బాడీలో సరిపడా నీరు ఉందో లేదని కొన్ని లక్షణాలు తెలుపుతాయి. ఆ లక్షణాలను బట్టి మీ బాడీకి సరిపడా నీరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. నీరు తక్కువగా తాగుతుంటే.. యూరిన్ పసుపుగా రావడం, తలనొప్పి ఎక్కువగా రావడం. లోబీపీ, చర్మం పొడిబారిపోవడం, మలబద్దకం, తరచుగా తిమ్మిర్లు, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి కనిపిస్తే రోజూ తీసుకునే మోతాదులో వాటర్ కంటే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

వాటర్ తక్కువగా తాగడం వల్ల బాడీ డీహైడ్రేషన్ అవుతుంది. దీంతో ఏకాగ్రత కోల్పోవడం, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొవడం, జ్ఞాపకశక్తి కూడా క్రమంగా తగ్గిపోవడం, ఆందోళన, అలసట వంటి సమస్యలు వస్తాయని వైద్యులు అంటున్నారు. డీహైడ్రేషన్ వల్ల మెదడుకు రక్తప్రవాహాం తగ్గడం వల్ల మెదడు పనితీరుపై ప్రభావం పడుతుంది. దీంతో దేని మీద కూడా ఇంట్రెస్ట్ చూపించలేరు. అలాగే శరీర పనితీరుపై కూడా నీరు చాలా ప్రభావం చూపిస్తుంది. బాడీకి సరిపడా నీరు తాగకపోతే.. కాళ్లు నొప్పులు, తిమ్మిరి, గుండె ప్రమాదాలు వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీర్ణ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా నీరు తాగాలి. లేకపోతే జీర్ణక్రియ దెబ్బతిని, తినే ఫుడ్ జీర్ణం కాదు. వీటితో పాటు మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యలు కూడా వస్తాయి. రోజుకి కనీసం ఎనిమిది గ్లాసుల నీరు అయిన తాగితే ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు.

కిడ్నీ సమస్యలతో బాధపడేవారు సాధారణ మోతాదులో కంటే ఇంకా ఎక్కువగా నీరు తీసుకోవాలి. ఎందుకంటే కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి నీటికి ఉంటుంది. ఎక్కువ మోతాదులో నీరు తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు రాకుండా ఉంటాయి. చర్మం కాంతివంతంగా మెరవాలంటే.. నీరు అవసరం. తక్కువగా నీరు తాగితే చర్మం పొడిబారుతుంది. దీనివల్ల మొటిమలు, ముడతలు రావడం, ముఖంలో గ్లో తగ్గిపోవడం వంటివి కనిపిస్తాయి. నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. బాడీ డీహైడ్రేషన్‌కి గురి కాకుండా ఉంచడంతో పాటు ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. కాబట్టి రోజుకి ఎక్కువగా నీరు తీసుకోవడం ఆరోగ్యానికి చాలామంచిది. లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా వేడినీరు తాగడం ఆరోగ్యానికి మంచిది.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.

Bhaskar
Bhaskarhttps://oktelugu.com/
Bhaskar Katiki is the main admin of the website
RELATED ARTICLES

Most Popular