Surya Grahanam : కాలం మారుతున్న కొద్దీ గ్రహాల గమనంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలో ఒక్కోసారి విపత్కర పరిస్థితులు ఏర్పడుతాయి. ఇలాంటి సమయంలో గ్రహాలతో సంబంధం ఉన్న కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. ఫలితంగా ఆ రాశులు ఉన్న వారి జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ప్రస్తతుం పితృపక్షాలు నడుస్తున్నాయి. అక్టోబర్ 2న ఇవి ముగుస్తాయి. ఈరోజు మహాలయ అమావస్యతో ఈరోజు ఎవరైనా పిండ ప్రదానం, పెద్దలకు సంబంధించి పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే ఇదే రోజు సూర్య గ్రహణం కూడా ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశులపై ఈ రోజు చాలా ప్రభావం పడనుంది. ముఖ్యంగా 5 రాశుల వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతోంది. ఆ 5 రాశుల వారు ఎవరో తెలుసా?
మహాలయ అమావాస్య ప్రభావం తులా రాశుల వారిపై పడనుంది. దీంతో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈరోజు ప్రయాణాల చేయడం మానుకోవాలి. కొత్త ప్రాజెక్టులు అస్సలు ప్రారంభించకూడదు. అదాయం కంటే ఖర్చులే అధికంగా ఉంటాయి. అందువల్ల ఆచి తూచి వస్తువులు కొనుగోలు చేయాలి. కొత్త వస్తువులు జోలికి అస్సలు వెళ్లకూడదు. ఎవరైనా వాదిస్తూ వారికి దూరంగా ఉండడం మంచిది.
కుంభ రాశి వారిపై గ్రహణ ప్రభావం పడనుంది. దీంతో ఈ రాశి వారు కొత్త పనులు ప్రారంభించకుండా ఉండాలి. ముఖ్యంగా వ్యాపారులు లాభాలు ఆర్జించడంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. భాగస్వాములతో సంయమనం పాటించాలి. కొత్త వ్యక్తులను ఎవరినీ నమ్మకుండా ఉండాలి. అప్రమత్తతో ఆదాయ వ్యవహారాలు జరపాలి. ఉద్యోగులు కోపాన్ని తగ్గించుకోవాలి. ఎలాంటి సమస్య అయినా నష్టం మీకే జరగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు కొత్త వ్యక్తులకు దూరంగా ఉండాలి.
మిథున రాశి వారు అక్టోబర్ 2న జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో కేర్ తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో గొడవ పడకుండా ఉండాలి. లేకుంటే చిన్న గొడవలే పెద్ద నష్టాన్ని తెచ్చి పెడుతాయి. మనసు ప్రశాంతంగా లేకపోయినా తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుది. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు.
అక్టోబర్ 2న వృశ్చిక రాశి వారు పెండింగ్ పనులు పూర్తి చేయడానికి చాలా కష్టపడుతారు. అయతే కొందరి మద్దతు తీసుకోవడం అవసరం. కుటుంబ సభ్యులతో గొడవపడకుండా ఉండాలి. అయితే ఈ రాశి వారికి సూర్యగ్రహణం కలిసి వస్తుంది.ఇప్పటికే మొదలు పెట్టిన ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తారు. అనుకోని అదృష్టం వరిస్తుంది. జీవిత భాగస్వామి కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.
సూర్యగ్రహణం ధనస్సు రాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంి. ఈ రాశి వారు కుటంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వీరు కొత్త పనులను ఎలాంటి ఆటంకం లేకుండా ప్రారంభిస్తారు. ఉద్యోగులు ఉల్లాసమైన వాతావరణం ఉంటుంది. అనుకోకుడా అదృష్టం వరిస్తుంది. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. అయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read More