Chiranjeevi – Mammootty : చిరంజీవి, మమ్ముట్టి ఇద్దరిలో ఎవరు గ్రేట్…

ఒక సందర్భంలో ఆయన చెప్పిన మాటలు అప్పట్లో సంచలనం సృష్టించాయి...ఇక స్టార్ డమ్ లో చిరంజీవిని కొట్టే హీరో ప్రస్తుతం లేడనే చెప్పాలి...

Written By: Gopi, Updated On : February 7, 2024 9:49 pm
Follow us on

Chiranjeevi – Mammootty : నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరు టచ్ చేయలేని రేంజ్ లో ఉన్న ఒకే ఒక హీరో చిరంజీవి. మెగాస్టార్ గా తన స్థానాన్ని విస్తరించుకొని ముందుకు సాగుతున్నాడు.ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ రక్తంతో తన సక్సెస్ కి చిరునామ ను రాసుకున్న ఒకే ఒక గొప్ప హీరో చిరంజీవి. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం చిరంజీవి పేరు చిరస్మరణీయంగా నిలిచిపోతుందనే చెప్పాలి. ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలు అలాంటివి.

ఇక ఇది ఇలా ఉంటే తెలుగులో చిరంజీవి మెగాస్టార్ గా మంచి గుర్తింపు పొందితే, మలయాళ ఇండస్ట్రీలో మమ్ముట్టి కూడా మెగాస్టార్ గా తనకంటూ ఒక స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్నాడు. అయితే వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ క్రేజ్ ఉంది అనే విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి చిరంజీవి ఇండియా లోనే టాప్ హీరో అనే విషయం మనకు తెలిసిందే. అయితే మమ్ముట్టి మలయాళం వరకు మాత్రమే పరిమితమైపోయాడు ఆయనకు పెద్దగా మార్కెట్ అయితే లేదు.

కానీ ఎక్స్పరిమెంటల్ సినిమాలు చేయడం లో గానీ, నటన పరంగా గాని చూసుకుంటే మమ్ముట్టి చాలా వైవిధ్యమైన పాత్రలను పోషించాడు. చిరంజీవి కంటే కూడా వైవిద్యమైన పాత్రలను చేశాడు. అయినప్పటికీ స్టార్ డమ్ లో మాత్రం చిరంజీవిని బీట్ చేయడంలో మమ్ముట్టి చాలా వెనకబడిపోయాడనే చెప్పాలి. ఎక్కువ స్టార్ డమ్ ఉన్న హీరోల్లో చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. సౌత్, నార్త్ అని తేడా లేకుండా ఆయనకి విపరీతమైన అభిమానులు ఉన్నారు.

నార్త్ లో చిరంజీవి సినిమాలు చేయకపోయిన కూడా ఆయనకి అక్కడ కూడా మంచి క్రేజ్ ఉంది. బాలీవుడ్ బిగ్ బి అయిన ‘ ‘అమితాబచ్చాన్’ మాట్లాడుతూ చిరంజీవిని చూస్తుంటే నాకు భయమేస్తుంది. ఎందుకంటే ఆయన నాకు పోటీ కాదు, నన్ను దాటేసి ముందుకు వెళ్తున్నాడు అంటూ ఒక సందర్భంలో ఆయన చెప్పిన మాటలు అప్పట్లో సంచలనం సృష్టించాయి…ఇక స్టార్ డమ్ లో చిరంజీవిని కొట్టే హీరో ప్రస్తుతం లేడనే చెప్పాలి…