India Vs Australia T20 Series: ఇండియా vs ఆస్ట్రేలియా టీ 20 సీరీస్ లో ఆధిపత్యం చెలాయించే టీమ్ ఏది అంటే..?

ఐదు టీ20ల సిరీస్‌లలో మొదటి మ్యాచ్ ఈ నెల 23 వ తేదీన విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియంలో రాత్రి 7 గంటల నుంచి జరగనున్నట్లు గా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : November 22, 2023 2:16 pm

India Vs Australia T20 Series

Follow us on

India Vs Australia T20 Series: 2023 వరల్డ్ కప్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇండియన్ టీం ఫైనల్ లోకి అడుగుపెట్టి అందులో ఆస్ట్రేలియా టీం పైన ఘోర పరాభావాన్ని మూటగట్టుకుంది. ఇలాంటి సమయంలో ఇండియన్ టీమ్ తీవ్రమైన నిరాశలో ఉంది. అయితే ఇలాంటి క్రమంలోనే బీసీసీఐ ఈనెల 23వ తేదీ నుంచి డిసెంబర్ 3 వ తేదీ వరకు ఆస్ట్రేలియా తో 5 t20 మ్యాచ్ లకు శ్రీకారం చుట్టింది.ఇక అందులో భాగంగానే ఇప్పటికే బిసియి ఇండియన్ టీం ని కూడా అనౌన్స్ చేసింది.అందులో రోహిత్, విరాట్ లాంటి సీనియర్లకు రెస్ట్ ఇచ్చింది.ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియన్ టీం వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి కారణంగా ఈ టి20 లో అయిన మనవాళ్ళు ఆధిపత్యాన్ని చెలాయించి వాళ్ళ పైన రివెంజ్ తీర్చుకుంటార అనేది చూడాలి.

ఎందుకంటే ఇండియన్ టీం లో ప్రస్తుతం ఉన్న ప్లేయర్లు అందరూ కూడా చాలా మంచి ఫామ్ లో ఉన్నారు.ఇక టి20 అంటే ఇండియన్ ప్లేయర్లకు పండగ అనే చెప్పాలి. ఎందుకంటే మన దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆడే ఐపీఎల్ లో ఆడే ప్లేయర్ కూడా తనదైన రీతిలో రాణిస్తూ టి20 ఫార్మాట్లో మనకు మన వాళ్లే సాటి అనే అంత రేంజ్ లో దూసుకుపోతున్నారు. అయితే మన జూనియర్ ప్లేయర్లు, ఆస్ట్రేలియా మెయిన్ ప్లేయర్లని ఎంతవరకు ఢీకొడతారు అనేది కూడా చూడాల్సి ఉంది…

అయితే ఈ ఐదు టీ20ల సిరీస్‌లలో మొదటి మ్యాచ్ ఈ నెల 23 వ తేదీన విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియంలో రాత్రి 7 గంటల నుంచి జరగనున్నట్లు గా తెలుస్తుంది. ఇక ఈ మ్యాచ్ పైన ఇండియన్ అభిమానులకి ఆస్ట్రేలియన్ అభిమానులకి మంచి ఆసక్తి కల్గిస్తున్నాయి. ఎందుకంటే ఈ రెండు టీం ల్లో ఏ టీమ్ టి 20లో ఏ జుట్టు పైన ఆధిపత్యం చెలయిస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే వచ్చే సంవత్సరం టి20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఇప్పటినుంచి ఆడే టి20 మ్యాచ్ అనేది వాళ్ళ టీం తరఫున వాళ్లకు కీలకం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇండియన్ ప్లేయర్లు ఆస్ట్రేలియన్ సీనియర్ ప్లేయర్లని ఎలా ఓడిస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది…

ఇక ప్రస్తుతం ఇండియన్ అభిమానులు కూడా వరల్డ్ కప్ మిస్ చేసుకున్నరనే నిరాశలో ఉన్నారు. కాబట్టి వాళ్లను మళ్ళీ ఉత్తేజపరచాలంటే టీం ప్లేయర్లు పక్కగా ఈ సిరీస్ ని కైవసం చేసుకుని చూపించాలి… ఇక ఇప్పటివరకు ఇండియా ఆస్ట్రేలియా టీమ్ లా మధ్య 26 t20 మ్యాచ్ లు జరిగితే అందులో ఇండియా 15 మ్యాచ్ ల్లో గెలిచింది,ఆస్ట్రేలియా 10 మ్యాచ్ ల్లో గెలిచింది, ఒక మ్యాచ్ రద్దు అయింది.ఇక దీని ప్రకారం చూసుకున్న ఇండియాదే పై చేయిగా ఉండడంతో ఈ సిరీస్ ని కూడా ఇండియా ఈజీగా గెలుస్తుంది అని చాలా మంది సీనియర్ ప్లేయర్లు ఆశ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు…