IPL Chennai Team 2024: ధోని ఈ ఇద్దరిలో ఎవరిని చెన్నై టీమ్ కి కెప్టెన్ ని చేస్తాడు..?ధోని ఓటు ఎవరి వైపు..?

ఈసారి ఎలాగైనా సరే కప్పు గెలిచి ఆరోసారి చెన్నై టీమ్ కప్పు అందుకొని ఐపిఎల్ లో అత్యంత ఎక్కువ సార్లు కప్పు గెలిచిన టీం గా చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు సృష్టించబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Written By: Gopi, Updated On : January 2, 2024 9:34 am

IPL Chennai Team 2024

Follow us on

IPL Chennai Team 2024: 2023 ఐపిఎల్ లో కప్పు కొట్టి తమ కంటు ఒక ప్రత్యేకతను చాటుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు మరో సారి ఐపిఎల్ రంగానికి సిద్దం అవుతుంది.ఇక ఇప్పుడు డైరెక్ట్ గా కప్పు మీద వాళ్ల దృష్టి ని పెట్టినట్టు గా తెలుస్తుంది.అయితే ధోని 2023 సీజన్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ చెన్నై టీమ్ కి ఇప్పుడు సరైన కెప్టెన్ లేడు కాబట్టి ధోని ఈ టీమ్ కి ఒక బలమైన నాయకున్ని పెట్టీ తను వైదొలగాలని ప్లాన్ చూస్తున్నాడు…అయితే ఇప్పుడు చెన్నై టీమ్ కెప్టెన్ గా అవకాశం కోసం ఇద్దరు ప్లేయర్లు ఎదురు చూస్తున్నారు వాళ్లు ఎవరో ఒకసారి మనం తెలుసుకుందాం…

ఇక ఈసారి ఎలాగైనా సరే కప్పు గెలిచి ఆరోసారి చెన్నై టీమ్ కప్పు అందుకొని ఐపిఎల్ లో అత్యంత ఎక్కువ సార్లు కప్పు గెలిచిన టీం గా చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు సృష్టించబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ధోని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ టీం కి కెప్టెన్ గా ఎవరు వ్యవహరిస్తారు అనే దానిపైన చాలా రోజుల నుంచి చాలా రకాల చర్చలు అయితే జరుగుతున్నాయి.

ఇక ఇప్పటికే కొంతమంది ధోని తర్వాత రుతు రాజ్ గైక్వాడ్ వ్యవహరించబోతున్నట్టు గా చాలా కథనాలను కూడా వెలువడుతున్నాయి. ఇక ఇదే క్రమం లో కొంతమంది మాత్రం రవీంద్ర జడేజా ని కెప్టెన్ గా చేయొచ్చు కదా అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అయితే ఇంతకుముందు జడేజా మ్యాచ్ లోకి కెప్టెన్ గా వ్యవహరించినప్పటికీ అతను ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు.ఇక దానివల్లే జడేజా ని పక్కనపెట్టి రుత్ రాజ్ గైక్వాడ్ ని కెప్టెన్ గా చేయాలనే ఉద్దేశ్యం లో చెన్నై యాజమాన్యం అలాగే ధోని ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విషయం మీద మరి కొంతమంది స్పందిస్తూ రవీంద్ర జడేజా ఏదో ఒక సీజన్ లో ఫెయిల్ అయినంత మాత్రాన కెప్టెన్ గా ఎప్పుడు ఫీలవుతాడు అని క్లారిటీగా చెప్పలేము.

కాబట్టి ఆయనకి మరొక ఛాన్స్ ఇచ్చి చూస్తే బాగుంటుందని వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే చెన్నై యాజమాన్యం కానీ ధోనీ కానీ చెన్నై టీమ్ నెక్స్ట్ కెప్టెన్ ఎవరు అనే దానిపైన ఒక క్లారిటీ కి అయితే రావడం లేదు. రుత్ రాజ్ గైక్వాడ్ ని కెప్టెన్ గా చేయాలనే ఉద్దేశ్యం లో ఉన్నప్పటికీ ఆయన ఎంత మాత్రం టీం ని సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్తాడు అనే విషయం పైన క్లారిటీ అయితే రావడం లేదు. ఇక ఈ విషయం మీద ఒక క్లారిటీ రావాలంటే ఈ సీజన్ లోనే ధోని ఉన్నప్పుడే వీళ్లని కొన్ని మ్యాచ్ లకు కెప్టెన్ గా చేసి వాళ్ళతో కొన్ని మ్యాచ్లు ఆడిస్తే ఎవరైతే టీం కి కెప్టెన్ గా బాగుంటాడో అతన్ని కెప్టెన్ గా చేస్తే బాగుంటుందని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…