Pawan kalyan : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ యాత్ర’ కి రోజు రోజుకి ప్రజాధారణ పెరుగుతూ పోతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. కత్తిపూడి సభతో ప్రారంభమైన ఈ యాత్ర నేడు కాకినాడ వరకు చేరుకుంది. కాకినాడ సభకు ముందు రోజు పవన్ కళ్యాణ్ నిర్వహించిన ‘జనవాణి’ ప్రోగ్రాం కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అయ్యింది.
ముఖ్యంగా దివ్యంగులతో ఆయన జరిపిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండింగ్ టాపిక్. అన్నా సీఎం అవ్వు అన్నా అని ఒక దివ్యంగుడు తమ సమస్యని ఆయనకి చెప్పుకొని అడగగా, ముందు నీ బాధ తీరుస్తాను, తర్వాత సంగతి తర్వాత అన్న మాట అభిమానులతో పాటుగా , ఇతర హీరోల అభిమానులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది.
ఇక ఈరోజు జరిగిన కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ వైసీపీ అరాచకాల గురించి మాట్లాడుతూ ‘ NCB రిపోర్ట్స్ ప్రకారం ఇప్పటి వరకు మన ఆంధ్ర ప్రదేశ్ లో 32 వేల మంది మహిళలు మిస్ అయ్యారు. హ్యూమన్ ట్రాఫికింగ్ లో మన ఆంధ్ర రాష్ట్రం దేశం లోనే రెండవ స్థానం లో ఉంది. ఈ దేశానికీ హోమ్ మినిస్టర్ స్థానం లో ఉన్న అమిత్ షా గారు, మొన్న వైజాగ్ కి వచ్చినప్పుడు వైసీపీ అరాచకాల గురించి తమ అసహనం వ్యక్తం చేసింది ఇలాంటి రిపోర్ట్స్ ని చూసే. ఆడబిడ్డలకు రక్షణ ఇవ్వలేకపోతుంది ఈ ప్రభుత్వం, ఆ స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడాడు అంటే, వైసీపీ పార్టీ పాలన లో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోండి, అనంతపురం జిల్లా, గొరంట్లలో ఒక యువతిని అత్యాచారం చేసి చంపేశారు, గత నెలలో నెల్లూరులో ఒక యువతిని అత్యాచారం చేసి చంపేశారు, పోయిన మే నెలలో భర్త పక్కన ఉండగా కొట్టి, మహిళపై సామూహిక హత్యాచారం చేస్తే, హోం మంత్రి వచ్చి దొంగతనం కోసం వచ్చారు, కావాలని అత్యాచారం చేయలేదు అని చెప్తే ఏం చేయాలి’ అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
According to the NCB, A total of 31k females are reported missing in AP, raising concerns about the alarming issue of human trafficking ! Save AP from YSRCP #VarahiVijayaYatra @PawanKalyan
pic.twitter.com/ZoEqlty5i4— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) June 18, 2023