Pawan Kalyan : గత మూడు రోజుల నుండి పవన్ కళ్యాణ్ జనసేన ‘వారాహి విజయ యాత్ర’ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఏ రాజకీయ పార్టీ కి కూడా రానటువంటి రెస్పాన్స్ , ఈ వారాహి యాత్ర ద్వారా జనసేన పార్టీ కి వస్తుంది, ఈ స్థాయి అనూహ్యమైన రెస్పాన్స్ ఇది వరకు పవన్ కళ్యాణ్ సభలకు వచ్చాయి, ఇది కొత్తేమి కాదు, కానీ ఈ ‘వారాహి విజయయాత్ర’ కి మాత్రం ఇతర హీరోల అభిమానుల నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.
రాష్ట్రంలో జనాలపై వైసీపీ పార్టీ చేస్తున్న దౌర్జన్యాలు, పూసగుచ్చినట్టుగా మొన్న పిఠాపురం సభలో చెప్పగా, అవి సోషల్ మీడియా మొత్తం వైరల్ గా మారింది. ఎక్కడ చూసినా దీని గురించే ప్రస్తుతం మాట్లాడుకుంటున్నారు. ఇక కాకినాడలో నేడు జరిగిన భారీ బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ వైసీపీ చేస్తున్న అక్రమాలను చెప్పుకొచ్చాడు.
ముఖ్యంగా రీసెంట్ గా బాపట్ల లో జరిగిన ఒక సంఘటన గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘ ఈమధ్యనే బాపట్ల లో ఒక BC బిడ్డని పొలం లో చెట్టుకు కట్టేసి నిలువున తగలబెట్టి చంపేస్తే, ఒక్కరు కూడా పట్టించుకోలేదు. బీసీ సంఘ నాయకులూ ఏమి చేస్తున్నారు?, న్యాయం చేయాల్సిన ఒక బీసీ ఎంపీ లక్ష రూపాయిల కట్ట పట్టుకుని వచ్చి భేరాలు ఆడుతున్నారు, ఒక ప్రాణాన్ని చంపేసి విలువ కడతారా, ఇలాంటి నాయకుల మధ్యన మనం బ్రతుకుతున్నది, ఇలాంటి నాయకులనా మనం ఎన్నుకుంటున్నది. ఒక్కసారి ఆలోచించండి ఈ ప్రభుత్వం లో లా & ఆర్డర్ ఏ స్థాయిలో పనిచేస్తుందో’ అంటూ చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘నిన్న జనవాణి కార్యక్రమం లో ఒక మహిళ వచ్చి చెప్పింది, నేను వస్తున్నానని పోస్టర్లు అతికిస్తుంటే కొంతమంది ద్వారంపూడి అనుచరులు నెంబర్ ప్లేట్ లేని వాహనాలు వేసుకుని వచ్చి చంపేస్తాం అని బెదిరిస్తున్నారు అంట’ అంటూ వైసీపీ పార్టీ కార్యకర్తలు చేస్తున్న బెదిరింపులు గురించి చెప్పుకొచ్చాడు.
https://www.youtube.com/watch?v=EaILFxLjAmY