దేశంలో కోట్ల సంఖ్యలో స్మార్ట్ ఫోన్ యూజర్లు వినియోగించే అప్లికేషన్లలో వాట్సాప్ యాప్ ఒకటి. ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్న వాట్సాప్ యాప్ త్వరలో బ్యాన్ కానుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ సోషల్ మీడియాను కట్టడి చేయడానికి మధ్యవర్తిత్వ మార్గదర్శకాలతో పాటు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ తో కూడిన నిబంధనలను అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.
Also Read: ఎల్‌ఐసీ కొత్త పాలసీ.. రోజుకు రూ.230తో రూ.17.5 లక్షలు మీ సొంతం..?
కేంద్రం అమలులోకి తెచ్చిన కొత్త నిబంధనల వల్ల ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లకు సమస్యలు తప్పవని తెలుస్తోంది. కొత్త నిబంధనలు అమలులోకి వస్తే దాని పర్యావసానాల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద సందేశాలు ఎవరి ద్వారా వచ్చాయో తెలుసుకోవడమే లక్ష్యంగా నిబంధనలలో కీలక మార్పులు చేయడం గమనార్హం.
Also Read: ఎస్బీఐ సూపర్ స్కీమ్.. నెలనెలా డబ్బులు తీసుకునే ఛాన్స్..?
అయితే ప్రస్తుతం దేశంలో వాట్సాప్ లాంటి యాప్స్ ఎండ్ టు ఎండ్ సెక్యూరిటీ నిబంధనలను పాటిస్తున్నాయి. కేంద్రం తెచ్చిన కొత్త నిబంధనలు అమలులోకి వస్తే ఈ నిబంధనలలో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 ప్రకారం ఇతర దేశాల నుంచి ఇండియాలో ఉన్నవారికి వచ్చే మెసేజ్ లకు సంబంధించిన సమాచారం మొదట కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
ఫేస్ బుక్ కు సంబంధించిన ప్రతినిధి కేంద్రం అమలులోకి తీసుకొచ్చిన నిబంధనల గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన నిబంధనలను స్వాగతిస్తున్నామని.. కేంద్రం నిబంధనల గురించి పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పారు.