https://oktelugu.com/

‘చెక్’ మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా

  రివ్యూ: చెక్ మూవీ నటీనటులు: నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్, పోసాని కృష్ణ మురళి, శ్రీమన్నారణ, సంపత్ రాజ్ దర్శకుడు: చంద్రశేఖర్ యేలేటి నిర్మాత: ఆనంద్ ప్రసాద్ విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి సినిమాలంటే అంతుచిక్కని రహస్యాలపై ఉంటాయి. ఊహించని ట్విస్టులతో సాగుతాయి. ఎదో పరిశోధిస్తున్నట్టు.. కొత్త విషయాన్ని కనుగొన్నట్టు ఉంటాయి. అలాంటి దర్శకుడు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత యువ హీరో నితిన్ తో తీస్తున్న మూవీ ‘చెక్’. ఈ సినిమా […]

Written By:
  • NARESH
  • , Updated On : February 26, 2021 / 11:18 AM IST
    Follow us on

     

    రివ్యూ: చెక్ మూవీ
    నటీనటులు: నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్, పోసాని కృష్ణ మురళి, శ్రీమన్నారణ, సంపత్ రాజ్
    దర్శకుడు: చంద్రశేఖర్ యేలేటి
    నిర్మాత: ఆనంద్ ప్రసాద్

    విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి సినిమాలంటే అంతుచిక్కని రహస్యాలపై ఉంటాయి. ఊహించని ట్విస్టులతో సాగుతాయి. ఎదో పరిశోధిస్తున్నట్టు.. కొత్త విషయాన్ని కనుగొన్నట్టు ఉంటాయి. అలాంటి దర్శకుడు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత యువ హీరో నితిన్ తో తీస్తున్న మూవీ ‘చెక్’. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

    Also Read: సూప‌ర్ స్టార్‌ మ‌హేష్ ప్లానింగ్.. మామూలుగా లేదుగా..!

    సరికొత్త కథ, కథనంతో నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటీ తాజాగా ‘చెక్’ సినిమాను తెరకెక్కించారు. ప్రియా ప్రకాష్ వారియర్ , రకుల్ ప్రీత్ హీరోయిన్లు. రకుల్ ఇందులో నితిన్ కు కాపాడే లాయర్ గా నటించారు. సాయిచంద్, మురళి శర్మ, సంపత్ రాజ్, పోసాని ఇతర ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రాన్ని ఆనంద్ ప్రసాద్ నిర్మించగా.. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు.

    *చెక్ మూవీ కథ
    నితిన్ (ఆదిత్య) ఉగ్రవాదులకు సహాయం చేసినందుకు గాను అతడికి కోర్టు దేశద్రోహిగా ముద్రవేసి జీవిత ఖైదు విధిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రకుల్ ప్రీత్ సింగ్ (మానస) అనే లాయర్ అనూహ్య పరిస్థితుల్లో నితిన్ కేసు టేకప్ చేస్తుంది. అప్పటికే డీలా పడిన నితిన్ కు రకుల్ జీవితంపై ఆశలు కల్పిస్తుంది. ఈ క్రమంలోనే తన గతాన్ని నితిన్ లాయర్ రకుల్ కు చెబుతాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ లో ఆదిత్యకి యాత్ర (ప్రియా ప్రకాష్)కి మధ్య లవ్ స్టోరీ సాగుతుంది. ఇంటర్ వెల్ వరకు సాగి చిన్న ట్విస్ట్ తో ముగుస్తుంది.

    సహసంగా చెస్ క్రీడాకారుడు అయిన ఆదిత్య చాంపియన్ షిప్ ఆటలు ఆడేందుకు అర్హత సాధిస్తాడు. జైలు గోడల మధ్యనే మాస్టర్ గా నిలుస్తాడు. కామన్ వెల్త్ చాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుతాడు. గ్రాండ్ మాస్టర్ గెలుస్తాడు. ఇక్కడే పలు సస్పెన్స్ సీన్లు ఆకట్టుకుంటాయి. నితిన్ తనపై పడ్డ మరకను ఎలా తొలగించుకున్నాడు? టెర్రరిస్టులతో ఆ కేసు కథేంటి? జైలు శిక్షనుంచి ఎలా బయటపడ్డాడన్నది అసలు కథ..

    * ప్లస్ పాయింట్స్

    కొత్త తరహా స్క్రిప్ట్ ఈ సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చింది. దర్శకుడు ఈ సినిమా కథకు ఎంచుకున్న కథాంశం అద్భుతమనే చెప్పాలి. సాయిచంద్ కూడా నటుడిగా ఆకట్టుకున్నాడు. ప్రేక్షకులకు ‘చెక్’ మూవీతో ఒక కొత్త నితిన్ ను పరిచయం చేశాడు. అద్భుతమైన నటనతో నితిన్ ఈ సినిమాకు ప్రాణం పోశాడు. నటుడిలోని కొత్త కోణాన్ని నితిన్ బయటపెట్టాడు. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. సినిమాకు స్క్రీన్ ప్లే మేజర్ హైలెట్. దీంతో సినిమా మంచి ఫీలింగ్ కలిగేలా తీర్చిదిద్దారు. థ్రిల్లర్ కథనానికి అవసరమైన అన్ని హంగులు, అంశాలు ఈ సినిమాను ముందుకు నడిపించాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. సంగీతం అదిరింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ అని చెప్పొచ్చు.

    Also Read: ‘మోసగాళ్లు’ ట్రైలర్ టాక్: పేదరికం నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నా..

    -మైనస్ ప్లాయింట్స్

    సినిమా రెండో ఆఫ్ స్లోగా జరగడం ఈ సినిమాకు మైనస్. రెండో అర్థబాగంలో ఈ గ్రిప్ ను దర్శకుడు కొనసాగించలేకపోయాడు. ఈ సినిమాలో పాత్రల క్యారెక్టరైజేషన్ విషయంలో దర్శకుడు యేలేటి శ్రద్ధ వహించాల్సి ఉంది. థ్రిల్లర్ కథాంశం కాబట్టి రన్ టైం తక్కువగా ఉంది. 135 నిమిషాలే కావడంతో పూర్తి క్యారెక్టర్లను చెప్పలేకపోయారు. మాస్ మసాల సినిమాలు చూసే ఆడియెన్స్ కు ఈ సినిమా ఆకట్టుకోదు. కమర్షియల్ ఫైట్లు లేకుండా లాజిక్ తో సాగే ఈ సినిమా కొంచెం మెచ్యూరిటీ పీపుల్ కే నచ్చుతుంది.

    *విశ్లేషణ

    మామూలు, మాస్ జనాలకు ఈ సినిమా అంతగా ఆకట్టుకోదు. కేవలం చంద్రశేఖర్ యేలేటి వంటి విలక్షణ దర్శకత్వ శైలిని ఇష్టపడే ప్రేక్షకులకే ఇది నచ్చింది. అయితే బోర్ కొట్టకుండా థ్రిల్లింగ్ ఈ సినిమా ‘చెక్’ణు దర్శకుడు ముందుకు తీసుకెళ్లాడు. ప్రీ ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలు కథను మరింత రక్తికట్టించాయి. కథలో ఉన్న లోతువల్ల సినిమా నిడివిని పెంచితే బాగుండు. ఇక పాత్రలు, కథనం బ్యాలెన్స్ పై దర్శకుడు ఫోకస్ చేయాల్సి ఉండేది. లాజిక్ పైనే సినిమాను నడిపించి ఎమోషన్ ను కొంచెం తగ్గించేశాడు. సెకండాఫ్ స్లోగా సాగడం మైనస్. క్లైమాక్స్ వరకు ప్రేక్షకులకు మంచి ఫీలింగ్ కలుగుతుంది.

    మాస్ మాసాలా, రోటీన్ కథాంశాలు ఇష్టపడని ప్రేక్షకులకు ఇది మంచి రిఫ్రెషింగ్ కథ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వారానికి ఈ సినిమా చూడొచ్చని చెప్పొచ్చు. 2021లో వచ్చిన అన్ని సినిమాల్లోకి ఇది బెస్ట్ కథ, కథనం అని చెప్పొచ్చు. రోటిన్ కథలకు భిన్నంగా ఈ కథను తీర్చిదిద్దారు.

    -ఓకే తెలుగు రివ్యూ: 2.5/5

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్