https://oktelugu.com/

ఎల్‌ఐసీ కొత్త పాలసీ.. రోజుకు రూ.230తో రూ.17.5 లక్షలు మీ సొంతం..?

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఎన్నో పాలసీలను అమలు చేస్తుండగా తాజాగా మరో కొత్త పాలసీని తీసుకొచ్చింది. బీమా జ్యోతి పేరుతో ఎల్‌ఐసీ తెచ్చిన ఈ పాలసీ వల్ల ఈ పాలసీలో చేరేవాళ్లకు ప్రయోజనం చేకూరనుంది. రోజుకు 230 రూపాయలతో 17 లక్షల 50,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. 15 నుంచి 20 సంవత్సరాల కాలపరిమితితో ఈ పాలసీని తీసుకోవచ్చు. Also Read: ఎస్బీఐ సూపర్ స్కీమ్.. నెలనెలా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 26, 2021 / 10:50 AM IST
    Follow us on

    దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఎన్నో పాలసీలను అమలు చేస్తుండగా తాజాగా మరో కొత్త పాలసీని తీసుకొచ్చింది. బీమా జ్యోతి పేరుతో ఎల్‌ఐసీ తెచ్చిన ఈ పాలసీ వల్ల ఈ పాలసీలో చేరేవాళ్లకు ప్రయోజనం చేకూరనుంది. రోజుకు 230 రూపాయలతో 17 లక్షల 50,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. 15 నుంచి 20 సంవత్సరాల కాలపరిమితితో ఈ పాలసీని తీసుకోవచ్చు.

    Also Read: ఎస్బీఐ సూపర్ స్కీమ్.. నెలనెలా డబ్బులు తీసుకునే ఛాన్స్..?

    ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1000కు 50 రూపాయలు గ్యారంటీ రిటర్న్ పొందవచ్చు. ఎంచుకున్న కాలపరిమితితో పోలిస్తే 5 సంవత్సరాలు తక్కువ ప్రీమియం కట్టవచ్చు. ఉదాహరణకు 18 సంవత్సరాలకు పాలసీ తీసుకుంటే 13 సంవత్సరాలు ప్రీమియం కడితే సరిపోతుంది. కనీసం లక్ష రూపాయల మొత్తానికి పాలసీ తీసుకునే అవకాశం ఉండగా గరిష్ట పరిమితి లేకపోవడం గమనార్హం.

    Also Read: దేశంలో బ్యాన్ కానున్న వాట్సాప్ యాప్.. నిజమేనా..?

    మూడు నెలల నుంచి 60 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా 5 నుంచి 6 శాతం రాబడి పొందే అవకాశం ఉంటే ఎల్‌ఐసీ పాలసీ తీసుకోవడం ద్వారా అంతకంటే ఎక్కువ మొత్తం రాబడిని పొందే అవకాశం ఉంటుంది. ఎవరైతే బీమా జ్యోతి పాలసీని తీసుకుంటారో వారికి పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందే అవకాశం కూడా ఉంటుంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    30 సంవత్సరాల వ్యక్తి 15 సంవత్సరాల పాలసీ టర్మ్ తో 10 లక్షల రూపాయల బీమా మొత్తానికి పాలసీని తీసుకుంటే 82 వేల రూపాయలు సంవత్సరానికి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా చెల్లిస్తే మెచ్యూరిటీ సమయంలో రూ.7.5 లక్షలు గ్యారంటీ అడిషన్ పొందే అవకాశం ఉంటుంది. మొత్తంగా 17.5 లక్షల రూపాయలు చేతికి అందుతాయి.