HomeజాతీయంRahul Gandhi : ఏంది రాహుల్.. నీకు ఇల్లులేకుండా చేస్తే దేశమే ఇల్లు చేసుకున్నావా!

Rahul Gandhi : ఏంది రాహుల్.. నీకు ఇల్లులేకుండా చేస్తే దేశమే ఇల్లు చేసుకున్నావా!

Rahul Gandhi : ఏంది సామీ? నీకు ఇల్లులేకుండా చేస్తే దేశమే ఇల్లు చేసుకున్నావా.. అర్దరాత్రి లారీలలో ప్రయాణిస్తూ, కాకా హోటళ్లకాడ, బస్సుల్లో పక్కసీట్లో కూర్చొని మాటకలుపుతూ…మన్‌కీ బాత్ అంటే ఇదా? అంటున్నారు తాజాగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన పనిచేసిన నెటిజన్లు. ఢిల్లీ నుంచి ఛండీ‌గఢ్‌కు ట్రక్కులో ప్రయాణించిన రాహుల్ గాంధీ.. డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.

శిమా‍్లకు వెళ్తూ..
హిమాచల్‌ప్రదేశ్‌లోని శిమ్లాకు వెళ్తున్న రాహుల్.. మార్గమధ్యలో ట్రక్కు డ్రైవర్లతో ముచ్చటించినట్లు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కాగా, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రస్తుతం షిమ్లాలో ఉన్నట్లు తెలిసింది. ఆమెను కలిసేందుకే రాహుల్ వెళుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రయాణం మధ్యలో ట్రక్కు డ్రైవర్లను రాహుల్ కలిశారు రాహుల్‌. దేశంలో 90 లక్షల మంది ట్రక్కు డ్రైవర్లు ఉన్నారని, వారికి అనేక సమస్యలు ఉన్నాయని కాంగ్రెస్ పేర్కొంది. ట్రక్కు డ్రైవర్ల మన్ కీ బాత్‌ను రాహుల్ విన్నారని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. కాంగ్రెస్ నేతలు కూడా ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు.

ట్రక్కులోనే ప్రయాణం..
సోమవారం రాత్రి ట్రక్కులో రాహుల్ గాంధీ తన ప్రయాణాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం 4.30 గంటలకు రాహుల్.. అంబాలాలోని ఓ గురుద్వారాకు వచ్చారని స్థానిక పోలీసులు తెలిపారు. అక్కడ ప్రార్థనలు చేసి ట్రక్కు ఎక్కి చండీగఢ్ వైపు వెళ్లిపోయారని చెప్పారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ లారీలో ప్రయాణించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో కాంగ్రెస్ నేతలు రాహుల్ చేసిన పనికి హర్షం వ్యక్తం చేస్తూ రీట్వీట్లు చేస్తున్నారు. రాహుల్‌ గాంధీ ట్రక్కు డ్రైవర్లతో ప్రయాణించి, మార్గమధ్యంలో ఆగి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నారని కాంగ్రెస్‌ నేతలు చెబుతునా‍్నరు.

వీడియో షేర్ చేసిన సుప్రియా శ్రీనాటే..
కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా కూడా ఈ వీడియోను షేర్ చేశారు. అర్ధరాత్రి బస్సులో సాధారణ పౌరులను, ట్రక్కు డ్రైవర్‌లను కలవడం వెనుక కారణాన్ని కూడా వివరిచారు. రాహుల్ గాంధీ ఈ దేశ ప్రజల సమస్యలను పూర్తిగా తెలుసుకొని, అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇలా చేశారని అన్నారు. ఇలా చేయడం చూస్తుంటే ఓ రకమైన ఆత్మవిశ్వాసం కల్గుతోందని ఆమె అన్నారు. అలాగే ప్రజలతో మమేకమైన వ్యక్తి.. వారి మంచి కోసం, రేపటి భవిష్యత్తు కోసం ఎలాంటి త్యాగం చేయడానికి అయినా వెనుకాడరని అన్నారు. ‘‘రాహుల్ గాంధీ భిన్నమైన వ్యక్తి. ఈ రోజు ఈ దేశంలో సాధారణ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య పెరుగుతున్న అంతరాన్ని తగ్గించడానికి ఆయన కట్టుబడి ఉన్నారు. ఈ వేడిలో, రాత్రంతా ట్రక్కు డ్రైవర్లతో కూర్చుని వారి సమస్యలను విన్నారు. వారికి భరోసా కల్పించారు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇటీవలే డెలివరీ బాయ్‌తో స్కూటర్ రైడ్..
దేశంలోని చిన్న వర్గాల ప్రజలతో మమేకమయ్యేందుకు రాహుల్ గాంధీ నిరంతరం ప్రయత్నిస్తున్నారు. గతంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బెంగళూరులో డెలివరీ బాయ్‌తో కలిసి స్కూటర్‌పై ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

– ఓల్డ్ ఢిల్లీలోని మతియా మహల్ మార్కెట్‌, బెంగాలి మార్కెట్‌కి కూడా గతంలో వెళ్లారు. అక్కడ చాలా సేపు షాపింగ్ చేశారు. అక్కడి ఫేమస్ వంటకాలన్నీ రుచి చూశారు. స్థానికంగా అందరూ ఎంతో ఇష్టపడే షర్బత్ తాగారు. పండ్లు తిన్నారు. ఆ తరవాత పానీపూరి కూడా టేస్ట్ చేశారు. అక్కడే కాదు. ఢిల్లీలోని ఫేమస్ ఫుడ్ పాయింట్‌లకు వెళ్లి సందడి చేశారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular