ఉగాది ప్రాశస్త్యం.. ఈరోజు ఏం చేయాలి?

ప్రపంచ జన్మ ఆయుష్షులకు తొలిరోజును ఉగాది అని అంటారు. మన దేశ సాంప్రదాయం ప్రకారం యుగమునకు ఆది కాబట్టి ఈరోజును ఉగాది పండుగగా జరుపుకుంటాం. పురాణాల ప్రకారం విష్ణుకు బ్రహ్మకు వేదాలను అప్పగించిన రోజునే ఉగాది పండుగను జరుపుకుంటాం. తెలుగువారికి కొత్త సంవత్సరాది అయిన ఉగాది పండుగను ప్రతి సంవత్సరం ఛైత్రశుద్ధ పాడ్యమి రోజున జరుపుకోవడం జరుగుతుంది. ఉగాది అంటి యుగమునకు, నక్షత్రమునకు ఆది అని అర్థం. బ్రహ్మదేవుడు సృష్టిని ఈరోజే ప్రారంభించాడని పురాణాలు చెబుతున్నాయి. ఉగాది […]

Written By: Kusuma Aggunna, Updated On : April 13, 2021 10:44 am
Follow us on

ప్రపంచ జన్మ ఆయుష్షులకు తొలిరోజును ఉగాది అని అంటారు. మన దేశ సాంప్రదాయం ప్రకారం యుగమునకు ఆది కాబట్టి ఈరోజును ఉగాది పండుగగా జరుపుకుంటాం. పురాణాల ప్రకారం విష్ణుకు బ్రహ్మకు వేదాలను అప్పగించిన రోజునే ఉగాది పండుగను జరుపుకుంటాం. తెలుగువారికి కొత్త సంవత్సరాది అయిన ఉగాది పండుగను ప్రతి సంవత్సరం ఛైత్రశుద్ధ పాడ్యమి రోజున జరుపుకోవడం జరుగుతుంది.

ఉగాది అంటి యుగమునకు, నక్షత్రమునకు ఆది అని అర్థం. బ్రహ్మదేవుడు సృష్టిని ఈరోజే ప్రారంభించాడని పురాణాలు చెబుతున్నాయి. ఉగాది రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకుని మామిడి తోరణాలతో అలంకరించాల్సి ఉంటుంది. తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి. ఇంట్లోకానీ ఆలయంలో కానీ భగవంతుడిని తప్పనిసరిగా ఆరాధించాలి. ఉగాది పచ్చడిని నేవేద్యంగా తప్పనిసరిగా స్వీకరించాలి. ఉగాది ప్రత్యేకతల్లో ఉగాది పచ్చడి ముఖ్యమైనది.

ఆరు రుచుల సమ్మేళనాన్ని ఉగాది పచ్చడి అని అంటారు. ఉగాది పచ్చడిని చైత్ర మాసంలో తీసుకుంటే కడుపులోని బ్యాక్టీరియా నశిస్తుంది. పంచాంగ శ్రవణం వల్ల రాబోయే పరిస్థితులపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలుగుతుంది. ప్లవనామ సంవత్సరం అనగా జల సమృద్ధి ఎక్కువగా ఉండే సంవత్సరం అనే అర్థం వస్తుంది. ఈ సంవత్సరంలో వెండి దానం చేస్తే మంచిదని పెద్దలు చెబుతారు.

ఫ్లవ నామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఈ విధమైన ఫలితాలు కలుగుతాయి. సింహ, కన్య, మేష, మీన రాశులకు చెందిన వాళ్లకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వృశ్చిక, తుల, కర్కాటక, వృషభ రాశుల వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. మిగిలిన రాశులకు మాత్రం ఫలితాలు ఆశాజనకంగా ఉండవు.