Hero Venkatesh : వెంకటేష్ లాంటి స్టార్ హీరో ఫ్యామిలీ హీరోగా మారడం వెనక కారణం ఏంటంటే..?

ఆయన సినిమాలు టీవీలో వస్తుంటే మిస్ అవ్వకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ చూస్తూనే ఉంటారు. నిజానికి ఆయనని ప్రతి ఫ్యామిలీలో కూడా ఒక మెంబర్ గా భావిస్తూ ఉంటారు...

Written By: Gopi, Updated On : December 22, 2023 9:53 pm
Follow us on

Hero Venkatesh : ప్రొడ్యుసర్ రామానాయుడు కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ తనదైన రీతిలో వరుసగా సినిమాలను చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే అన్ని జానర్స్ లలో సినిమాలు చేసిన వెంకటేష్ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని మాత్రం ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఫ్యామిలీ సినిమాలు ఎక్కువ గా చేస్తూ వాళ్ళకి బాగా దగ్గరయ్యాడు. అయితే ఆయన అలా చేయడానికి గల కారణం ఏంటి అంటే వీళ్ల ముందు తరంలో శోభన్ బాబు ఫ్యామిలీ సినిమాలను చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు.

అందువల్లే తనకి ఒక సపరేట్ క్రేజ్ ఉండేది. ఆ తర్వాత వచ్చిన హీరోలు ఎవరు కూడా ఫ్యామిలీకి సంబంధించిన సబ్జెక్టులతో రాలేకపోవడం వల్ల ఇండస్ట్రీని అప్పటికే 20 సంవత్సరాల నుంచి గమనిస్తూ వస్తున్న రామానాయుడు తన కొడుకు వెంకటేష్ ని ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గర చేయాలనే ఉద్దేశ్యం తోనే ఫ్యామిలీ సబ్జెక్టులని ఎంచుకొని అలాంటి సినిమాలు ఆయనతో చేయించారు. ఇక ఈ క్రమంలో రామానాయుడు గారి ప్లాన్ సక్సెస్ అయింది. అందుకే వెంకటేష్ ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యాడు. అలా కాకుండా తన కెరీయర్ మొత్తం ఫ్యామిలీ సినిమాలతో లాగించేసుకుంటూ వస్తున్నాడు. ప్రతి సినిమాలో కూడా ఎమోషన్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని టచ్ చేసే విధంగా వెంకటేష్ సినిమాలో సీన్లు సెంటిమెంట్ గా కనిపిస్తూ ఉంటాయి.

అందుకే ఆయన వరుస సినిమాలను చేయడంలో ఎప్పుడు సక్సెస్ అవుతూ వస్తున్నాడు. ఇక ఫ్యామిలీ సబ్జెక్ట్ ని డీల్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఒకవేళ దాన్ని కరెక్ట్ గా డీల్ చేయగలిగితే సక్సెస్ అనేవి ఈజీగా వస్తాయి. లేకపోతే మాత్రం ప్లాపు లు వస్తాయి. ఇక ఇలాంటి చాలా టాస్క్ లను వెంకటేష్ చాలా సునాయాసంగా చేసి సక్సెస్ లు కొట్టి తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. చిరంజీవి బాలకృష్ణ లాంటి హీరోలు మాస్ సినిమాలు చేస్తుంటే వెంకటేష్ మాత్రం ఫ్యామిలీ సినిమాలు చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గర అయిపోయాడు…

ఇక ఇలా తనకంటూ ఒక సపరేట్ స్టైల్ అయితే ఏర్పాటు చేసుకున్నాడు.అయినప్పటికి కూడా వెంకటేష్ అంటే ఫ్యామిలీ అభిమానులు చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఇప్పటికి ఆయన సినిమాలు టీవీలో వస్తుంటే మిస్ అవ్వకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ చూస్తూనే ఉంటారు. నిజానికి ఆయనని ప్రతి ఫ్యామిలీలో కూడా ఒక మెంబర్ గా భావిస్తూ ఉంటారు…