https://oktelugu.com/

వివిధ రకాల బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న అర్థం ఏమిటో తెలుసా..?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం బొట్టు పెట్టుకోవడం ఒక ఆచారంగా భావిస్తారు. చాలామంది ఇప్పటికీ దేవుని దర్శనం చేసుకున్న తర్వాత బొట్టు పెట్టుకోవడం మనం చూస్తూనే ఉంటాం. ఇక పెళ్ళయిన స్త్రీలు ఎల్లప్పుడు వారి నుదిటిపై తిలకం పెట్టడం మనం చూస్తుంటాం. అదే విధంగా పూజ చేసిన అనంతరం బొట్టు పెట్టుకోవడం, దేవతా విగ్రహాలకు బొట్లు పెట్టి పూజ చేయడం ఇవన్నీ మన ఆచార సంప్రదాయాలలో ఒక భాగంగా పాటిస్తూ వస్తున్నాము. అయితే ఒక్కొక్కరు ఒక్కో విధమైన […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 24, 2021 / 11:01 AM IST
    Follow us on

    మన హిందూ సాంప్రదాయాల ప్రకారం బొట్టు పెట్టుకోవడం ఒక ఆచారంగా భావిస్తారు. చాలామంది ఇప్పటికీ దేవుని దర్శనం చేసుకున్న తర్వాత బొట్టు పెట్టుకోవడం మనం చూస్తూనే ఉంటాం. ఇక పెళ్ళయిన స్త్రీలు ఎల్లప్పుడు వారి నుదిటిపై తిలకం పెట్టడం మనం చూస్తుంటాం. అదే విధంగా పూజ చేసిన అనంతరం బొట్టు పెట్టుకోవడం, దేవతా విగ్రహాలకు బొట్లు పెట్టి పూజ చేయడం ఇవన్నీ మన ఆచార సంప్రదాయాలలో ఒక భాగంగా పాటిస్తూ వస్తున్నాము. అయితే ఒక్కొక్కరు ఒక్కో విధమైన బొట్టును పెట్టుకోవడం కూడా మనం చూసే ఉంటాము. ఈ విధంగా వివిధ రకాల బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

    Also Read: నెమలి పించం ఇంట్లో పెట్టుకుంటున్నారా… అయితే ఏం జరుగుతుందో తెలుసా..!

    పూర్వకాలంలో బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు ఒక్కొక్కరు ఒక్కో విధమైన తిలకాన్ని నుదిటిపై పెట్టుకొనేవారు. పురోహితులు లేదా శాస్త్ర సంబంధమైన వృత్తిని కొనసాగించే బ్రాహ్మణులు నుదుటిపై తెల్లని చందనాన్ని పెట్టుకునేవారు. క్షత్రియులు యుద్ధంలో పాల్గొనే వారు కనుక వారి నుదిటి పై ఎర్రని తిలకాన్ని వీర తిలకంగా పెట్టుకునేవారు. అదేవిధంగా వ్యాపారంలో ఎంతో మెలుకువగా ఉన్న వైశ్యుల వంశానికి చెందిన వారు వ్యాపార అభివృద్ధికి చిహ్నంగా పసుపు రంగు కేసరితో నుదుటిపై తిలకం పెట్టుకునేవారు. అదేవిధంగా సూక్తులు నల్లటి భస్మాన్ని బొట్టుగా పెట్టుకునేవారు.

    Also Read: మన ఇంట్లో సిరిసంపదలు కలగాలంటే ఈ మార్పులు చేయాల్సిందే..!

    ఈ విధంగా ఒక్కో వంశానికి చెందిన వారు ఒక్కో విధమైన బొట్టు పెట్టుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే ప్రస్తుత కాలంలో కూడా ఎవరైనా దేవాలయాలను సందర్శించినప్పుడు అక్కడ ఉండేటటువంటి బొట్టును దేవుడు ప్రసాదంగా స్వీకరించి నుదిటిపై పెట్టుకుంటారు. అయితే బొట్టును ఎల్లప్పుడు రెండు కనుబొమ్మల మధ్య పెట్టుకున్నప్పుడు మాత్రమే మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం