Homeఎంటర్టైన్మెంట్Aacharya Chiranjeevi: ‘ఆచార్య’కు ఇంతటి అవమానమేల..?

Aacharya Chiranjeevi: ‘ఆచార్య’కు ఇంతటి అవమానమేల..?

Aacharya Chiranjeevi : తెలుగు సినిమా చరిత్రలో హీరో వర్షిప్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్ మాస్ హీరోగా ఎలివేట్ అయ్యింది మెగాస్టార్ చిరంజీవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. పెద్ద ఎన్టీఆర్ ను సినీ పరిశ్రమ అంతా అన్న గారు అని పిలుచుకునేది. ఆ తర్వాత ఆ స్థానం దక్కింది మెగాస్టార్ కే. అభిమానులు కావచ్చు లేదా సినీ పరిశ్రమలోని వారు కావచ్చు… ఆప్యాయంగా అన్నయ్యా అని పిలిపించుకున్నా లేదా బాసు అని పిలిపించుకున్నా అదీ కేవలం మెగాస్టార్ చిరంజీవికే దక్కింది. తన దైన మేనరిజం, డ్యాన్స్ లో గ్రేస్… డైలాగ్స్ లో మాస్ ని కనికట్టు చేయగలిగిన హీరో చిరంజీవి. ఎన్టీఆర్ తర్వాత తరంలో శోభన్ బాబు, క్రిష్ణ, క్రిష్ణంరాజు, మురళీమోహన్, చంద్రమోహన్ తదితర హీరోలు ఓ వెలుగు వెలిగిన నందమూరి తారకరామారావు రేంజ్ దరిదాపులో నిలబడిన హీరో ఒక్కరూ లేరు. సూపర్ స్టార్ క్రిష్ణ పలు సందర్భాల్లో ఎన్టీఆర్ కు మించి సూపర్ హిట్లు, రిస్కీ డెసిషన్స్ తీసుకున్నా ఆ రేంజ్ స్టార్ డమ్ మాత్రం రాలేదు. ఆ తర్వాతి తరంలో హీరోల సంఖ్య పెరిగినా నలుగురు మాత్రమే స్టార్ డమ్ దక్కించుకున్నారు. అందులో ముందుండేది మాత్రం మెగాస్టార్ చిరంజీవే. మెగాస్టార్ చిరంజీవి, బాలక్రిష్ణ, వెంకటేష్, నాగార్జున మరో తరంలో హీరోలుగా ఎస్టాబ్లిష్ అయ్యారు. మోహన్ బాబు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా చేస్తూనే హీరోగా విజయం సాధించారు. అదే తరంలో సుమన్, జగపతిబాబు, రాజశేఖర్, నాగబాబు, భానుచందర్, రాజేంద్రప్రసాద్, నరేశ్, రమేష్ బాబు తదితరులు హీరోలుగా ఎస్టా్బ్లిష్ అయినా సక్సెస్ ను నిలబెట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యారు.

-1990వ దశకంలో నంబర్ వన్ మెగాస్టారే..
1990వ దశకంలో నంబర్ వన్ హీరో ఘనత సాధించింది మెగాస్టార్ చిరంజీవినే. ఎన్టీఆర్ నటవారసుడిగా బాలక్రిష్ణ, ఏఎన్ఆర్ నట వారసుడిగా నాగార్జున, క్రిష్ణ నట వారసుడిగా రమేష్ బాబు హీరోలుగా రాణించారు. అలాగే ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ వారుసుడిగా వీబీ రాజేంద్ర ప్రసాద్ కుమారుడు జగపతి బాబు, హీరోయిన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ కుమారుడు నరేష్ వారసుడిగా తెరంగేట్రం చేశారు. వీరిలో సూపర్ హీరోస్ గా రాణించి, సక్సెస్ ని నిలబెట్టకున్నది మాత్రం నలుగురే. అందులో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానంలో బాలక్రిష్ణ, వెంకటేష్, నాగార్జున మాత్రమే ఉన్నారు. జగపతి బాబు మాత్రం హీరోగా కంటిన్యూ కాలేకపోయినా విలన్ గా సౌతిండియాలో ఎస్టాబ్లిష్ అయ్యారు. తర్వాత రెండు జనరేషన్స్ వచ్చినా ఇప్పటికీ ఆ నలుగురు తర్వాతే మిగతా వారి పేర్లు వినిపిస్తున్నాయి.

– ఆచార్యకు ఊహించని షాక్
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ అంచనాలు అందుకోవడంలో ఆచార్య విఫలమయ్యాడు. మెగా హీరోలు ఒకేసారి ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపిస్తే అభిమానులకు అంతకు మించి పండగ ఏముంటుంది. కానీ దీనిని సద్వినియోగం చేసుకోవడంలో మెగా క్యాంఫ్ ఫెయిల్ అయ్యింది. సినిమా ఫలితాలు ఎప్పడూ ఒకేలా ఉండవు. తారుమారు కావచ్చు లేదా ఊహించని డిజాస్టర్లూ కావచ్చు. ఇప్పుడు ఆచార్యలోనూ ఏదో వెలితి కనిపిస్తోంది. చిరంజీవి బిగ్ బాస్ తర్వాత ఆ రేంజ్ లో ఫ్లాఫ్ మూటగట్టుకున్న సినిమా దాదాపు ఆచార్య మాత్రమే. కారణాలు ఏవైనా కావచ్చు మెగాస్టార్ సినిమా మొదటి మూడు రోజుల తర్వాత థియేటర్లు ఎత్తేస్తున్న సినిమా బహుశా ఇదే కావచ్చు. అలాగే చరణ్ ఆరెంజ్ తర్వాత ఈ స్థాయిలో ప్లాఫైన సినిమా ఇదే.

-థియేటర్లు ఎత్తేయడమే..
సోమవారం నుంచి మెజారిటీ థియేటర్ల నుంచి ఆచార్యను ఎత్తేస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవలి సూపర్ హిట్ మూవీ కేజీఎఫ్-2 ను కంటిన్యూ చేసే ఆలోచనలో డిస్ర్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఉన్నట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు సీఎంలు టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చినా ఆచార్యకు మాత్రం కలిసి రాలేదు.

-దిల్ రాజు కూడా ఒక కారణమా..?
రెండు తెలుగు రాష్ట్రాల్లో డిస్ర్టిబ్యూషన్ వ్యవస్థ దాదాపు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అండర్ మేనేజ్మెంట్ లోనే ఉంది. థియేటర్లపై గుత్తాధిపత్యం చెలాయిస్తున్నాడు. ఆర్ ఆర్ఆర్ , కేజీఎఫ్-2 సినిమాలకు దిల్ రాజునే పంపిణీ దారుడు. అలాగే ఇటీవలి రాధేశ్యామ్ కు పంపిణీదారు దిల్ రాజే. రాధేశ్యామ్ నష్టాలను ఆర్ఆర్ఆర్ ద్వారా భర్తీ చేసుకోగలిగాడు. అలాగే కేజీఎఫ్-2 కూడా దిల్ రాజుకు లాభాలను తెచ్చిపెట్టింది. కానీ ఆచార్య పంపిణీ హక్కులను భారీ మొత్తానికి వరంగల్ శ్రీను దక్కించుకున్నాడు. సినిమా విడుదలకు ముందు నుంచే పలు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. దిల్ రాజు మంచి థియేటర్లను ఆచార్య కు ఇవ్వకుండా అడ్డుకున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ఆచార్య అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదనే సాకుతో తిరిగి కేజీఎఫ్-2 ను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం.

-ఇండస్ట్రీ బిడ్డకు అవమానం..
ఏపీలో సినిమా టికెట్ల రేట్లు పెంచేందుకు జగన్ ప్రభుత్వం అనుమతించకపోగా, అదనపు షోలకు ససేమిరా అంది. ఈ క్రమంలో చిరంజీవి జగన్ తో భేటి అయ్యేందుకు చొరవ చూపాడు. పలువురు హీరోలతో పాటు సోలోగా ఏపీ సీఎం జగన్ తో సమావేశమయ్యాడు. భీమ్లానాయక్ తర్వాత ఏపీలో టికెట్ల రేట్ల పెంపులో చిరంజీవి సఫలమయ్యాడు. కానీ తన సినిమా విషయంలో మాత్రం థియేటర్లు ఎత్తేస్తున్న ఏ మాత్రం కలుగజేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. సినీ పరిశ్రమలో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అటుఇటు కావడం సాధారణమేనని నిరూపించేందుకు మెగాస్టార్ ఉదంతమే ఇందుకు నిదర్శనం.
శెనార్తి

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version