Vijayendraprasad Rajakar Files: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి అన్ని అవకాశాలను వాడుకుంటోంది. రాష్ట్ర నాయకత్వానికి తోడుగా అధిష్టానం కూడా పుల్ సపోర్టు ఉండడంతో ఇక్కడి బీజేపీ నాయకులు దూసుకుపోతున్నారు. ఇప్పటికే జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణలో నిర్వహించి దేశం దృష్టిని ఆకర్షించారు. అలాగే రాష్ట్రపతి కోటాలో కొందరికి రాజ్యసభ సీట్లు ఇచ్చేశారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ కు ఛాన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లు కేవలం రచయితగానే పరిచయం ఉన్న ఆయన ఇప్పుడు బీజేపీ నాయకుడిగా మారిపోతున్నాడు.

ఈక్రమంలోనే బీజేపీ కోరిక మేరకు ‘రజాకార్ల ఫైల్స్’ సినిమా కోసం స్క్రిప్టు తయారు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ తాను రాసే స్టోరీలో ఎలాంటి వివాదం ఉండదని వివరణ ఇచ్చారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ‘రజాకార్ల ఫైల్స్’ సినిమా తీస్తామని ప్రకటించారు. దీంతో విజయేంద్రప్రసాద్ నిజంగానే ‘రజాకార్ల ఫైల్స్’ స్టోరీ రాస్తున్నారా..? అనే చర్చ ప్రారంభమైంది.
Also Read: Gargi Movie Review: రివ్యూ: గార్గి
బీజేపీ తరుపున విజయేంద్రప్రసాద్ రాజ్యసభకు వెళ్లనున్న నేపథ్యంలో ఆయనను బండి సంజయ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుక్ కలిశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన తరువాత ‘రజాకార్ల ఫైల్స్’ స్టోరీ గురించి మట్లాడినట్లు సమాచారం. అయితే అప్పటికే ఈ నేపథ్యమున్న స్టోరీని రచిస్తున్న విజయేంద్రప్రసాద్ కు తెలంగాణలో రజాకార్ల ఆగడాలపై మరింతగా ప్రజలను ఆకర్షించేలా స్టోరీ తీయాలని కోరినట్లు సమాచారం. కేసీఆర్, ఎంఐఎం పార్టీలకు వ్యతిరేకంగానే ఈ కథ తయారు చేస్తారన్న ప్రచారం జోరందుకోవడంతో మీడియా వేదికగా వస్తున్న ఈ ఆరోపణలపై విజయేంద్రప్రసాద్ వివరణ ఇచ్చారు. అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు. మరి బండి సంజయ్ చెప్పినట్లే విజయేంద్రప్రసాద్ రాస్తారా..? లేక సొంతంగా కథ రాస్తారా..? అనేది తెలియాల్సి ఉంది.

విజయేంద్ర ప్రసాద్ కథను అందించిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. దేశభక్తి ప్రధానంగా తీసిన ఆర్ఆర్ఆర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ ను చూపించారు.. గాంధీ, నెహ్రూలను చూపించలేదని కొందరు ప్రశ్నించారు. దీనిపై విజయేంద్రప్రసాద్ ఇచ్చిన వివరణకు బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. విజయేంద్రప్రసాద్ తో ‘రజాకార్ల ఫైల్స్ ’ సినిమా రాయిస్తే తమకు ఉపయోగపడుతుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో ముందస్తు ఎన్నికల జోరు పెరిగింది. ఎన్నికల సమయానికి ఈ సినిమా రిలీజ్ అయితే ప్రజల్లో మార్పు వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు.
ఇప్పటికే కశ్మీర్ పండిట్లపై వచ్చిన ‘కాశ్మీర్ ఫైల్స్’ దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో తెలంగాణలో బీభత్సకాండ సృష్టించిన రజాకార్ల ఫైల్స్ సినిమాతో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావొచ్చని బీజేపీ అనుకుంటోంది. ఇప్పటి వరకు అందరి మనసులు దోచుకున్న విజయేంద్రప్రసాద్ ‘రజాకార్ల ఫైల్స్’ సినిమాను బీజేపీ చెప్పినట్లు రాస్తే వివాదాస్పదుడిగా మారుతారు. దీంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read:CM Jagan Graph: జగన్ గ్రాఫ్ తగ్గిందంటే మేము ఒప్పుకోం.. అదంతా చంద్రబాబు కుట్రే
[…] Also Read: Vijayendraprasad Rajakar Files: రజాకర్ ఫైల్స్.. డిఫెన్స్ వ… […]
[…] Also Read: Vijayendraprasad Rajakar Files: రజాకర్ ఫైల్స్.. డిఫెన్స్ వ… […]
[…] Also Read:Vijayendraprasad Rajakar Files: రజాకర్ ఫైల్స్.. డిఫెన్స్ వ… […]