Liger Twitter Review: బాక్సాఫీస్ వద్ద ‘లైగర్’ సందడి మొదలైంది. ఆగస్టు 25న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘రౌడీ హీరో’ విజయ్ దేవరకొండ నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘లైగర్’ విడుదలైంది. ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్స్ పడిపోగా.. హైదరాబాద్ లో ఈ ఉదయం షోలు వేశారు. దీంతో టాక్ బయటకు వచ్చింది. చాలా మంది ట్విట్టర్ లో స్పందిస్తున్నారు.

ప్యాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై బోలెడు అంచనాలున్నాయి. ఎందుకంటే అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’, అక్షయ్ రక్షాబంధన్ అట్టర్ ఫ్లాప్ అయినవేళ బాక్సాఫీస్ అంతా ‘లైగర్’పైనే ఆశలు పెంచుకుంది. ఈ సినిమా ట్రైలర్ తోపాటు మంచి బజ్ ను సృష్టించింది. ప్రమోషన్స్ కూడా బాగా గట్టిగానే చేశారు.ఈ సినిమా చూసిన జనాలు సినిమా ఎలా ఉందో చెప్పేస్తున్నారు. ఈ సినిమా కథ, కథనాలు ఎలా ఉన్నాయంటే?
తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 70 కోట్లకు పైగా లైగర్ బిజినెస్ జరిగింది. నైజాంలోనే 30 కోట్లకు అమ్మారు. హిందీ మార్కెట్ లో 100 కోట్లకు పైగానే అమ్మారు. ఓవర్సీస్ ను 8 కోట్లకు అమ్మినట్టు తెలిసింది. తమిళనాడు, కర్ణాటక, మలయాళంలోనూ మొత్తం కలిపి 60 కోట్ల వరకూ బిజినెస్ చేశారు.
#Liger opened with average/Disappointing reviews
Saw some tweets Puri's #Pokiri & #Businessman movies too opened with average reviews
Wait panni paakalam weekend performance
Weekend um poor na, kandippa #VJD tweets vachi seivanga Twitteratis 😷😷 pic.twitter.com/dGlEY8Fvs7
— arunprasad (@Cinephile05) August 25, 2022
కథ చూస్తే.. ముంబైలోని ఓ మురికివాడకు కరీంనగర్ నుంచి పొట్ట చేత్తో పట్టుకొని వెళ్లి ఛాయ్ అమ్ముతూ జీవనం గడిపే ఓ తల్లి కుర్రాడు.. ఎలా ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ గా మారాడనేది కథ. ఇందులో ఎమోషన్ కలగలపి.. దేశం స్పోర్ట్స్ సత్తాను చూపేలా చూపించారు. ఇందులో మైక్ టైసన్ కథను మలుపుతిప్పే పాత్రలో నటించారు.
https://twitter.com/Rebelstar008/status/1562622392240730115?s=20&t=H2BIAAqErELakhzFmHF11w
సినిమా ఫస్ట్ హాట్ పిచ్చెక్కేలా ఉందని.. హీరో విజయ్ దేవరకొండ లుక్స్ అదిరిపోయాయని ఫ్యాన్స్ అంటున్నారు. రమ్యక్రిష్ణ మరోసారి నటనతో ఆకట్టుకుందని..అనన్యపాండే తన పాత్ర పరిధికి నటించి మెప్పించిందని చెబుతున్నారు. కథ, కథనం బాగుందని.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందని అంటున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ పూరి మార్క్చూపించారని కొంతమంది ట్వీట్ చేస్తున్నారు.
https://twitter.com/barbaarikk/status/1562535107248136193?s=20&t=Uri8_rVqkK48JHD9OPTB_Q
ఇక కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపించినా.. ఆ తర్వాత వచ్చే ఎంగేజింగ్ సీన్స్ బాగున్నాయని అంటున్నారు. ఈ సినిమా మాస్ కు ఫుల్ మీల్స్ అంటుననారు. మంచి కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ అంటూ లైగర్ పై మరికొంతమంది అభిమానులు తమ రివ్యూలలో పేర్కొంటున్నారు.
https://twitter.com/prashanth_gudi/status/1562607054329909249?s=20&t=JIMO4faEGgXd8IJFimSvgQ
మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీని పూరి తన కిష్టమైన ‘బ్రూస్ లీకి’ అంకితమిచ్చారని.. అర్జున్ రెడ్డికి మించి విజయ్ ఇందులో అద్భుతంగా నటించారని కొనియాడుతున్నారు.
https://twitter.com/RylBengalTiger/status/1562527623791915009?s=20&t=kG6228hRW0lJQoOVnGNHrw
ఇంకొందరు సినిమా ఫస్టాఫ్ యావరేజ్ అంటున్నారు. ఎలివేషన్ సీన్లు, కొన్ని డైలాగ్స్ వర్కవుట్ అయ్యాయని అంటున్నారు. స్టోరీ బాగుందని.. విజయ్ నటన సూపర్ అని.. నత్తి అతడికి సూట్ కాలేదంటున్నారు. మైక్ టైసన్ ను సరిగా ఉపయోగించుకోలేదని అంటున్నారు. అనన్యకు స్కోప్ లేదంటున్నారు. సెకండాఫ్ 40 నిమిషాలు ఓకే అంటున్నారు.
https://twitter.com/KumarSwayam3/status/1562517767949291520?s=20&t=iKp-kKV-V4f6SVum7qIyqw
పుష్ప, సర్కారువారి పాట మాదిరిగానే నెగెటివ్ టాక్ తో మొదలై బ్లాక్ బస్టర్ గా లైగర్ మారుతుందని అంటున్నారు కొందరు. స్టోరీ లైన్ బాగాలేదని కొందరు.. కథ ఊహించినట్టుగానే ఉంటుందంటున్నారు.అందరినీ మెప్పించలేకపోవచ్చని అంటున్నారు.
A below average first half followed by a hideous second half. HIDEOUS. Abysmal writing and horrible screenplay. A climax Endira 😭😭😭
There's no story no screenplay just random montages. VD couldn't do much either. Stammer, ruining characterization😭
— saisaysmovies (@saisaysmovies) August 24, 2022
లైగర్ మూవీ ఒక యాక్షన్ మూవీ అని కొందరు అంటున్నారు. సాంగ్స్ బాగాలేవని.. స్టోరీ, స్ట్రీన్ ప్లే బాగాలేదని అంటున్నారు. సాధారణ ప్రేక్షకులకు నచ్చుతుందనంటున్నారు. కొందరేమో యావరేజ్ సినిమా అని అంటున్నారు. క్లైమాక్స్బాగాలేదని.. సెకండాఫ్ సాగదీశారని అంటున్నారు.మొత్తంగా ఫ్లాప్ టాక్ అయితే రావడం లేదు. హిట్, యావరేజ్ అని మెజార్టీ చెబుతున్నారు.
#Liger A movie that had potential to be decent is wasted by senseless writing and cringe worthy scenes!
VD tried his best and body transformation is great but his stammering is annoying. Heroine track is awful. Other than a few moments, Nothing else to mention.
Rating: 2.25/5
— Venky Reviews (@venkyreviews) August 24, 2022
[…] […]
[…] […]
[…] […]
[…] […]