Apple: మార్కెట్లో ఎన్ని కంపెనీల ఫోన్లు ఉన్నా..ఆపిల్ ఫోన్ రేంజే వేరు. పొలిటికల్ లీడర్ల నుంచి పేజీ త్రీ సెలబ్రిటీల వరకు కోరుకునేది ఆపిల్ నే! దాని నాణ్యత, మన్నిక అలా ఉంటుంది మరి! ఆపిల్ కంపెనీ ప్రతిఏటా కొత్త మోడల్ ను ఆవిష్కరిస్తుంది. దీనికోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. తన ఉత్పత్తుల నాణ్యతలో ఏమాత్రం రాజీ పడదు కాబట్టే ఆపిల్ కంపెనీ అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్ గా వెలుగొందుతోంది. అలాంటి చరిత్ర ఉన్న ఆపిల్ ఇప్పుడు భారత గుమ్మాన్ని తొక్కబోతోంది! ఇన్నాళ్లు డ్రాగన్ దగ్గర సెల్ ఫోన్లు అసెంబ్లింగ్ చేయించిన ఆపిల్ ఇప్పుడు ఆ దేశానికి టాటా చెప్పబోతోంది.

చైనాలో అనిచ్చిత పరిస్థితులే కారణం
గత రెండేళ్ల నుంచి కోవిడ్ 19 వల్ల డ్రాగన్ దేశంలో లాక్ డౌన్ అమలవుతున్నది. ఇప్పటికీ చాలా నగరాల్లో ఆ వైరస్ అదుపులోకి రాలేదు. వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో వస్తువుల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. ఇందుకు ఆపిల్ కూడా మినహాయింపు కాదు. పైగా గత కొద్ది రోజుల నుంచి అమెరికాతో డ్రాగన్ ఢీ అంటే ఢీ అంటోంది. ఫలితంగా ఆపిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చైనాకు భారత్ కంటే వేగంగా ఫోన్లు తయారు చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ భౌగోళిక అంతరాలు, నాణ్యతలో ఏర్పడుతున్న సమస్యలు ఆపిల్ కు చికాకు తెప్పిస్తున్నాయి. పలమార్లు ఈ విషయాన్ని చైనా సంస్థలకు చెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మరోవైపు డ్రాగన్ వ్యవహరిస్తున్న తీరుతో అమెరికా ఇబ్బంది పడుతోంది. ఆపిల్ సంస్థ ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది కాబట్టి.. దేశానికి అనుగుణంగానే సంస్థ కూడా చైనా నుంచి బయటికి రావాలని నిర్ణయం తీసుకుంది.
భారత దేశాన్ని ఎంచుకోవడానికి కారణం
ప్రస్తుతం భారతదేశంలో అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ అమెరికా సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. పైగా ఇక్కడ మానవ వనరులు అమెరికాతో పోలిస్తే చాలా చావక. దీనికి తోడు ప్రభుత్వం కూడా భారీగా రాయితీలు కల్పిస్తోంది. డ్రాగన్ దేశానికి చెందిన షావోమీ, వివో, ఒప్పో వంటి స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను ఇక్కడే రూపొందించి విక్రయిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని కూడా భారతదేశంలో నెలకొల్పాలని ఆపిల్ యోచిస్తోంది. ఇప్పటివరకు చైనాలో రూపొందించిన ఆపిల్ స్మార్ట్ ఫోన్ లను విక్రయించి, తర్వాత భారత్లో ప్రారంభించాలని అనుకుంటున్నది. ఫాక్స్ కాన్ టెక్నాలజీ అనే సంస్థ ఇప్పటికే చెన్నైలోని ఒక ప్లాంట్ లో ఆపిల్ ఫోన్ల అసెంబ్లింగ్ ను విజయవంతంగా చేపట్టింది.

దీంతో ఆపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్ భారతదేశంలో తమ ప్లాంట్ ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేశారు. అన్ని అనుకున్నట్టుగా అయితే ఐఫోన్- 14 మోడల్ ను తమిళనాడులోని చెన్నై వెలుపల ఉన్న ప్లాంట్ లో తయారు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మోడల్ నవంబరు లోపు మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ లోగానే నమూనా ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావాలని ఆపిల్ కంపెనీ యోచిస్తోంది. ఇప్పటికే భారత దేశ సరిహద్దుల్లో యుద్ధ నౌకలను మోహరించడం, సరిహద్దు దేశాల్లో రోడ్లు నిర్మించటం, సైనికులతో విన్యాసాలు నిర్వహించడం వంటి చేష్టలకు పాల్పడుతున్న చైనా.. ఆపిల్ తీసుకున్న నిర్ణయంతో షాక్ కు గురవుతోంది. ఎంత లేదన్నా ఆపిల్ కంపెనీ ద్వారా డ్రాగన్ దేశానికి సంవత్సరానికి 5వేల నుంచి 7 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ప్రస్తుతం అవన్నీ భారతదేశానికి లభిస్తాయి. అమెరికాతో ఉన్న వైరం వల్ల ఆపిల్ ను చైనా ఇప్పుడు ఏమీ అనలేని దుస్థితి. అందుకే దురాశ దుఃఖానికి చేటు. చైనా పరిభాషలో చెప్పాలంటే అమెరికా తో కయ్యం డ్రాగన్ కు మరింత చేటు.
Also Read:Bangaram Girl: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘బంగారం’ భామ
[…] […]