దేశంలో గడిచిన 11 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలకు చేరింది. పెట్రోల్ ధరలు పెరగడంతో వాహనదారులు పెట్రోల్ ను కొనుగోలు చేయడానికి ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి వస్తోంది. రికార్డు స్థాయిలో పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో వాహనదారులకు ఖర్చులు పెరుగుతున్నాయి.
Also Read: కొత్త కారు కొనాలనుకునే వారికి శుభవార్త.. ఈ కార్లపై భారీ తగ్గింపు..?
దేశంలో ఈ నెలలోనే పెట్రోల్ ధరలు ఏకంగా 13 సార్లు పెరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలపై పన్నులను తగ్గించాలని వాహనదారులు కోరుతున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలు కావడం గమనార్హం. మన దేశంలో పెట్రోల్ ధరలు అంతకంతకూ పెరుగుతుంటే కొన్ని దేశాల్లో మాత్రం పెట్రోల్ ధరలు అంతకంతకూ తగ్గుతుండటం గమనార్హం.
Also Read: వెలుగులోకి కొత్తరకం మోసం.. సిమ్ బ్లాక్ అంటూ లక్షల్లో మాయం..?
దక్షిణ అమెరికా దేశాలలో ఒకటైన వెనిజులాలో లీటర్ పెట్రోల్ ధర కేవలం మన దేశ కరెన్సీ ప్రకారం ఒక్క రూపాయి 45 పైసలు కావడం గమనార్హం. అత్యంత చౌకగా పెట్రోల్ విక్రయించే దేశాలలో ఒకటిగా వెనిజులా నిలిచింది. అయితే ఇతర దేశాలతో పోలిస్తే హాంగ్ కాంగ్ లో పెట్రోల్ ధర 2.40 డాలర్లు పలుకుతోంది. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ , భూటాన్, పాకిస్తాన్ దేశాలతో పోలిస్తే భారత్ లో పెట్రోల్ ధర ఎక్కువగా ఉంది.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
మన దేశంలో ఫిబ్రవరి నెలలో పెట్రోల్ రూ .3.24, డీజిల్ రూ .3.47 పెరిగింది. గడిచిన ఏడాది కాలంలో మన దేశంలో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా 17 రూపాయలు పెరగడం గమనార్హం. కువైట్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.25.18గా ఉండగా అంగోలాలో రూ.17.78, ఇరాన్ లో రూ 4.50గా ఉంది.