నటీనటులు : సుమంత్, నందిత, నాజర్, జయప్రకాశ్, వెన్నెల కిషోర్ తదితరులు
నిర్మాణ సంస్థ : క్రియేటివ్ ఎంటర్‌టైన్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్
సంగీతం : సిమన్ కె కింగ్
సినిమాటోగ్రఫీ : రసమతి
ఎడిటర్ : ప్రవీన్ కేఎల్
నిర్మాతలు : ధనంజయన్, లలితా ధనంజయన్
దర్శకత్వం : ప్రదీప్ కృష్ణమూర్తి
విడుదల తేది : ఫిబ్రవరి 19
Also Read: రివ్యూః నాంది
అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సుమంత్ మొదట్లో మంచి మంచి సినిమాలే చేశాడు. కానీ.. ఆ తర్వాత కాలంలో అపజయాలు ఎదురుకావడంతో సైలెంట్ అయిపోయాడు. చాలా కాలం గ్యాప్ తర్వాత థ్రిల్లర్ కథతో మళ్లీ తెరపైకి వచ్చాడు. ఎలాగైనా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలనే తపనతో ‘కపటధారి’గా ఆడియన్స్ ను పలకరించాడు. కన్నడ సూపర్ హిట్ ‘కవలుధారి’కి ఇది రీమేక్. మరి, ఈ సినిమా ఎలా ఉంది? సుమంత్ ఫ‌్లాప్ సీక్వెల్ కు అడ్డకట్ట వేసిందా? అనేది చూద్దాం.
కథ:
గౌతమ్ (సుమంత్) ట్రాఫిక్ ఎస్సై. అయితే.. రోడ్డుమీద వాహనాలను మళ్లించడం అతడికి ఇష్టం ఉండదు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేయాలనేది అతడి కల. రెగ్యులర్ పోలీసు డ్యూటీలో చేరడానికి ఎన్నో సార్లు ప్రయత్నించినా..పై అధికారులు ఛాన్స్ ఇవ్వరు. దీంతో ట్రాఫిక్ విభాగంలో అసంతృప్తినే డ్యూటీ చేస్తుంటాడు. ఇలాంటి సమయంలోనే అతడికి ఓ అవకాశం అందివస్తుంది. ఒకరోజు మెట్రో నిర్మాణం కోసం చేపట్టిన తవ్వకాల్లో మూడు అస్థిపంజరాలు బయటపడతాయి.
కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ సాగిస్తారు. కానీ.. వారికి ఎలాంటి ఆధారాలూ లభించవు. కారణం ఏమంటే.. అవి దాదాపు 40 సంవత్సరాల క్రితం నాటి అస్తిపంజరాలు. దీంతో. కేసును మూసేయాలని నిర్ణయించుకుంటారు. అయితే.. గౌతమ్ మాత్రం ఆ కేసును సీరియస్‌గా తీసుకొని, ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. ఆయనకు జర్నలిస్ట్ గోపాల్ కృష్ణ (జయప్రకాశ్) పరిచయం అవుతాడు. వీరిద్దరూ కలిసి నిజాలను శోధిస్తుండగా.. ఇదే కేసును 40 ఏళ్ల క్రితం టేకప్ చేసిన రిటైర్డ్ పోలీసు అధికారి రంజన్ (నాజర్) పరిచయం అవుతాడు. వీళ్ల నుంచి పలు వివరాలు సేకరించిన గౌతమ్.. కేసును మరింత వేగంగా తవ్వుతుంటాడు. ఈ క్రమంలోనే ఆలేరు శ్రీనివాస్ అనే పేరు బయటకు వస్తుంది. అతనెవరు? ఈ అస్థిపంజరాలకు, అతడికి సంబంధం ఏంటి? ఈ కేసును గౌతమ్ ఎలా ఛేదించాడు? అన్నది తెరపైనే చూడాలి.
పెర్ఫార్మెన్స్:
పోలీసు క్యారెక్టర్లో సుమంత్ పర్ఫెక్ట్ గా నటించాడు. కానీ.. ఇంకా ఛాన్స్ ఉందనిపిస్తుంది. ఆయన తర్వాత నాజర్ పాత్ర బలమైనది. రిటైర్డ్ పోలీసు అధికారి రంజిత్ పాత్రలో ఆయన జీవించాడు. జరల్నిస్టుగా జయప్రకాశ్ కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. వెన్నెల కిషోర్ ఫస్ట్ హాఫ్ లో కొన్ని చోట్ల నవ్విస్తాడు. హీరోయిన్ నందిత పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. మిగిలిన నటీనటులు తమ పరిధిమేర నటించారు.
Also Read: ట్రైలర్ టాక్: పెళ్లాం పోరు.. సస్పెన్స్ థ్రిల్లర్ గా ‘క్షణక్షణం’
విశ్లేషణ:
పోలీస్ స్టోరీ అంటేనే కావాల్సినంత హీరోయిజానికి స్కోప్ ఉంటుంది. ఇక, దానికి క్రైమ్ యాడ్ చేస్తే.. ఊహకందని ట్విస్టులతో ప్రేక్షకులను కట్టి పడేయొచ్చు. కపటధారి ఒరిజినల్ ‘కవలుధారి’ అద్భుతమైన కథనంతో ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. రీమేక్ లో ఆ స్థాయి బిగి కనిపించదు. దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి కొంత మేర బాగానే ఆకట్టుకున్నప్పటికీ.. ఇంకా అద్భుతంగా తెరకెక్కించే అవకాశాన్ని యూజ్ చేసుకోలేదని అనిపిస్తుంది. అయితే.. ఉన్నంతలో కథలోని ట్విస్ట్‌లు ప్రేక్షకులను సినిమాలో లీనం చేస్తాయి. దర్శకుడు ఒరిజినల్ వెర్షన్‌ని యాజిటీజ్ గా దించేశాడు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కాస్త మార్పులు చేస్తే బాగుండేది. ఇంకా.. స్లో నెరేషన్.. కొన్ని సీన్లు రిపీట్ కావడం కూడా ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం బ్యాగ్రౌండ్ స్కోర్. క్రైమ్, థ్రిల్లర్ సినిమాలకు నేపథ్య సంగీతమే అసెట్. సిమోన్ కె కింగ్ మంచి నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి. ‘క్రైమ్ మైదానం’లో నలువైపులా బౌండరీలు సాధించే అవకాశం ఉన్నప్పటికీ.. సెలక్టెడ్ ఏరియాలపైనే దృష్టి పెట్టిన దర్శకుడు.. టాప్ స్కోర్ సాధించలేకపోయాడనే ఫీలింగ్ కలుగుతుంది.
ప్లస్ పాయింట్స్ :
సుమంత్, నాజర్ నటన
ఇంటర్వెల్ బ్యాంగ్
బ్యాగ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్ :
స్లో నెరేషన్
రొటీన్ క్లైమాక్స్
లాస్ట్ లైన్ః కపటధారి.. రొటీన్ పాత్రధారి
రేటింగ్ 2.5
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్