Ranga Ranga Vaibhavanga Review: నటీనటులు: వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ, నవీన్ చంద్ర, సీనియర్ నరేష్, ప్రభు, ప్రగతి, తులసి తదితరులు
దర్శకత్వం :గిరీశాయ
స్క్రీన్ ప్లే : గిరీశాయ
నిర్మాతల : ప్రసాద్
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ : షామ్‌దత్ సైనుదీన్

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా ‘రంగ రంగ వైభవంగా’ అంటూ ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం పరిస్థితి ఏమిటో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం !
Also Read: Pawan Kalyan First Movie: హీరో కాకపోతే పవన్ చేద్దామనుకున్న పని అదే!
కథ :
రిషి (వైష్ణవ్ తేజ్) రాధ (కేతిక శర్మ) చిన్నతనం నుంచి మంచి ఫ్రెండ్స్. ఒకేరోజు పుట్టిన వీరు, ఒకేలా ఆలోచిస్తారు. వీరి కుటుంబాలు కూడా ఎంతో స్నేహంగా ఉంటాయి. అయితే.. పదేళ్ల వయసులో వీరి మధ్య జరిగిన ఓ గొడవ కారణంగా రిషి – రాధ విడిపోతారు. ఇద్దరి మధ్య మాటలు కూడా ఉండవు. ఇలాంటి నేపథ్యంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రిషి – రాధ ఫ్యామిలీస్ విడిపోతాయి. మరి రిషి – రాధ తమ ప్రేమ కోసం ఏం చేశారు ?, తమ రెండు ఫ్యామిలీస్ ను తిరిగి ఎలా కలిపారు ?, ఈ మధ్యలో వంశీ (నవీన్ చంద్ర) ఎందుకు వీరి ప్రేమకు అడ్డుగా నిలుస్తాడు ? చివరకు ఏం అవుతుంది అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
‘రంగ రంగ వైభవంగా’.. చాలా స్లోగా స్లోగా సాగుతూ బోరింగ్ ప్లేతో ముగిసింది. అసలు ఈ సిల్లీ ఎమోషనల్ లవ్ డ్రామాలో ఏ పాత్రకు బరువైన సంఘర్షణ లేదు. నటీనటులు కూడా తమ పాత్రకు తగ్గట్లు తమ లుక్ ను తమ బాడీ లాంగ్వేజ్ ను చేంజ్ చేసుకుంటూ.. చివరివరకూ ఒకే ఎమోషన్ ను పలికించడం ఈ సినిమా దౌర్భాగ్యం. అయితే, కొన్ని కీలకమైన సన్నివేశాల్లో వైష్ణవ్ తేజ్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. మరో కీలక పాత్రలో నటించిన నవీన్ చంద్ర కూడా చాలా సహజంగా నటించాడు. నరేష్, ప్రభు తమ రొటీన్ నటనతో జస్ట్ ఓకే అనిపించారు. ప్రగతి – తులసి ఓవర్ యాక్షన్ లో పోటీ పడ్డారు.
అసలు ఈ కథ జరిగిన నేపథ్యం, మెయిన్ ప్లాట్ గత ముప్పై ఏళ్ల క్రితం నాటి పాత ఆలోచనల రొంప. సినిమా చూస్తున్నంత సేపు గతంలో ఎక్కడో ఈ సీన్స్ చూశాం కదా అనే భావన కలుగుతుంది. నువ్వే కావాలి, ఆనందం, నిన్నే పెళ్లాడతా లాంటి సినిమాల వాసనలు ఈ సినిమా నిండా నిండిపోయాయి. డైరెక్టర్ రాసుకున్న భావోద్వేగాలు మరీ సిల్లీగా సాగాయి.

మొత్తమ్మీద ఈ సినిమాలో మ్యాటర్ లేదు. కామెడీ కోసం పెట్టిన సత్య కామెడీ సీన్ మినహా ఏ సీన్ వర్కౌట్ కాలేదు. రెగ్యులర్ ప్లే విసిగిస్తోంది. ఫేక్ ఎమోషన్స్, లాజిక్ లేని సీన్స్ సినిమాకి పెద్ద మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ చిత్రం కనీస స్థాయిలో కూడా మెప్పించలేకపోయింది.
ప్లస్ పాయింట్స్ :
వైష్ణవ్ తేజ్ నటన,
మిగిలిన నటీనటుల నటన,
సత్య కామెడీ సీన్.
మైనస్ పాయింట్స్ :
స్లో నేరేషన్,
రెగ్యులర్ స్క్రీన్ ప్లే,
బోరింగ్ డ్రామా,
రొటీన్ సీన్స్,
అండ్ ఫేక్ ఎమోషన్స్
తీర్పు :
ఈ ‘రంగ రంగ వైభవంగా’.. సిల్లీ ఎమోషనల్ అండ్ లవ్ డ్రామాగా సాగుతూ బోర్ కొట్టించింది. ఏ క్యారెక్టర్ లో డెప్త్ లేదు. ఓవరాల్ గా ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.
రేటింగ్ : 2/5
Also Read:Hari Hara Veera Mallu- Power Glance: తొడగొట్టాడు.. తెలుగోడు.. హరిహర వీరమల్లుగా పవన్ విశ్వరూపం
[…] Also Read: Ranga Ranga Vaibhavanga Review: రివ్యూ : ‘రంగ రంగ వైభవంగా’ […]
[…] […]