US Midterm Elections 2022 Results : అమెరికా ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలు బైడెన్ కు అనుకూలంగా వచ్చాయి. ఇండియాలో లోక్ సభ, రాజ్యసభలాగానే.. ‘హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్’ అని అమెరికాలో ఉంటాయి. ఈ హౌస్ కు ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతుంటాయి. ఇది మన లోక్ సభ లాంటిది.
అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నికై 2 సంవత్సరాలు అవుతుండడంతో ఈ ‘హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్’ ఎన్నికలు నిర్వహిస్తారు. ఇది అధ్యక్షుడి ఎన్నికతో సంబంధం లేదు. ఏ బిల్ పాస్ కావాలన్నా వీళ్ల మద్దతే కీలకం. వీరు బిల్లు పాస్ చేస్తేనే అమెరికా అధ్యక్షుడి చెంతకు బిల్స్ వెళతాయి.
మొన్నటివరకూ ఇటు హౌస్ లో.. సెనెట్ లో బైడెన్ కే ఎక్కువ మద్దతు ఉంది. అందుకే బైడెన్ ఈజీగా బిల్లులు పాస్ చేసుకున్నారు. అయితే అన్ని సర్వేల్లో బైడెన్ కు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని కోడైకూసాయి. ద్రవ్యోల్బణం, అధిక ధరలు, అబార్షన్లు కీలక పాత్ర పోషించాయని.. ప్రతిపక్ష రిపబ్లికన్ లదే ఈసారి విజయం అని అందరూ అంచనావేశారు.
ఈ మిడ్ టర్మ్ ఎన్నికల్లో బైడెన్ కు చెందిన అధికార డెమొక్రటిక్ పార్టీ ఘోరంగా ఓడిపోతుందని అందరూ భావించారు. కానీ ఊహకు అందని విధంగా రాజకీయ అంచనాలకు భిన్నంగా డెమొక్రటిక్ పార్టీకే మద్దతు లభించడం విశేషం. డెమొక్రటిక్ కు ఎందుకు మద్దతు తెలిపారు..? గెలుస్తారనుకున్న రిపబ్లికన్లు ఎలా ఓడిపోయారన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.
